తొమ్మిది రోజుల పాదయాత్ర విజయవంతం చేయాలి

జనం సాక్షి కథలాపూర్
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించే తొమ్మిది రోజుల పాదయాత్ర విజయవంతం చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయతి నాగరాజ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాగరాజు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత్ జోడో కార్యక్రమానికి మద్దతుగా పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎన్ ఎస్ యు ఐ నాయకులు ప్రతి ఒక్క హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో పీసీసీ కార్యవర్గ సభ్యులు తొట్ల అంజయ్య ఉపాధ్యక్షుడు శ్రీహరి ఎంపిటిసి పులి శిరీష హా రీప్రసాద్ ఆకుల సంతోష్ అర్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు