తొలిమెట్టు సూత్రాలను వందశాతం అమలు చేయండి.
జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్.
వెన్నచెర్ల పాఠశాలలను పరిశీలించిన కలెక్టర్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 21(జనంసాక్షి):
కరోన కారణంగా ఐదవ తరగతి లోపు విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరమైనం దంన వారికి చదవడం రాయడం తో పోటు గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహరం చేయగలిగే. స్థాయిలో తీసుకురావడానికి తొలిమెట్టు కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగిందని ఇందులో సూచించిన విద్యా బోధన విధానం వందశాతం అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ ఆదేశించారు.మన ఊరు మన బడి కార్యక్రమ పరిశీలనకై శుక్రవారం ఉదయం కలెక్టర్ పెద్దకొత్తపల్లి మండలంలోని వెన్నెచెర్ల,ప్రాథమిక పాఠశాల,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలకు మన ఊరు మనబడి కింద మౌళిక సదుపాయాల కల్పనకు 14.3 లక్షలు మంజూరు కాగా చేపట్టిన పనులు విద్యుత్తు, తాగు నీరు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర మౌళిక సదుపాయాలను పరిశీలించారు. విద్యుత్తు సంబంధిత పనులు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు పనులను నిబంధన ప్రకారం చేసారా లేదా అని పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మంజూరు ఆయిన 46 లక్షల రూపాయల పనులు యింకా ప్రారంభించ లేదని,ఉన్న గదులను నేలమట్టం చేసి కొత్తగా నిర్మించేందుకు అనుమతించమని సర్పంచు కోరగా ప్రభుత్వ నిధులతో పాటు దాతల నుండి విరాళాలు సేకరించాలని అప్పుడు పరిశీలించవచ్చన్నారు.వెన్నెచెర్ ల ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి, 4, 5వ తరగతి గదిలో విద్యార్థుల చదువు సామర్థ్యాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.తరగతి గదిలో ప్రతి విద్యార్థితో మాట్లాడుతూ వారికి చదవడం, రాయడం, గణితం లో ఏ మాత్రం నేర్చుకున్నారో పరిశీలించారు.చాలా మంది విద్యార్థులు వారి తెలుగు పాఠ్యంశం చదవడానికి రాకపోగా, కూడికలు, తీసివేతలు, గుణకారం భాగహారాలు చేయలేకపోయారు. తరగతి నుండి ముగ్గురు నలుగురు విద్యార్థులు చదవటం, రాయడం తో పాటు గణితంలో లెక్కలు చేయగలిగారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తొలిమెట్టు కార్యక్రమములో పెట్టిన నిబంధనలు తరగతి సమయం పెంచడం,విద్యార్తులకు బేస్ లైన్ పరీక్ష నిర్వహించి విద్యాప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.విద్యార్థులను భాగస్వాములను చేసి వారిలో ఉన్న భయాన్ని పారద్రోలి అర్ధమయ్యే రీతిలో విద్యాభ్యాసం చేయించాలన్నారు.ప్రతి నెల 3వ శనివారం బాల సభ నిర్వహించి పిల్లల ద్వారా కథలు చెప్పించడం, రాయించడం ఇతరత్రా యాక్టివిటి చేయించాలని సూచించారు.మధ్యాహ్న భోజనం ఎలా ఉందో పరిశీలించారు.పంచాయతి రాజ్ ఈ.ఈ. దామోదర్ రావు, తహసిల్దార్, మండల విద్యాధికారి చంద్రుడు, గ్రామ సర్పంచు రాధ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు కలెక్టర్ వెంట పాల్గొన్నారు.