తొలి పోరులో తలపడనున్న ఢిల్లీ కొల్‌కత్త
కొల్‌కత : ఐపీఎల్ 6 ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కొల్‌కతా నైట్‌రైడర్స్ ను డిల్లీ డేర్‌డేవిల్స్ ఢీకొట్టనుంది.కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో మరికొద్ది గంటల్లో జరుగనున్న ఈ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు ముగిసాయి. ఐదవ సీజన్లో కప్పు నెగ్గిన ఉత్సాహాంతో , మరింత బలోపెతమయ్యామన్న విశ్వాసంతో కోల్‌కతా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతుంది. జట్టు కెప్టెన్ గంభీర్ కామెర్ల వ్యాది నుంచి కోలుకోవడంతో కోల్‌కతా ఊపిరి పీల్చుకుంది .కలిస్ , నరైన్ ,మోర్గాన్ , యూస్‌ప్ పఠాన్ , బాలాజీ వంటి ఆటగాళ్లతో కోల్‌కతా బలంగా కనిపిస్తుంది. ఇంకోవైపు డిల్లీ గత ఏడాదికి భిన్నంగా కనిపిస్తుంది. నిరుడు బలంగా ఉన్న జట్టు ఈసారి కీలక ఆటగాళ్ల గైర్వాజరుతో కొంత బలహీనపడింది. ఇప్పటికే దూరమైన ఆటగాళ్లతో పాటు జట్టు ప్రధాన ఆటగాడు సెహ్వగ్ కూడా తొలి మ్యాచ్‌కు ఆడడం అనుమానం కావడం ఢిల్లీకి ఆందోళన కలిగించే అంశం ఈ జట్టులో గత ఏడాది అత్యదిక వికెట్లు తీసిన మోర్ని మోర్కెల్ కూడా లేకపోవడంతో బౌలింగ్ విభాగం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇవన్ని పరిస్ధితులను తట్టుకుని జట్టును విజయపథంలో నడిపించడం జట్టు కేప్టెన్ జయవర్దనేకు సవాలుగా మారనుంది.ఈ జట్టులో నమన్‌ఓజా ,ఆశిశ్ నెహ్ర ,వార్నర్ వంటి ఆటగాళ్ల ప్రధానంగా మారనున్నారు.