తొలి స్వర్ణం.. సాధించిన దేశాలు


రియో డి జనీరో: రియో ఒలింపిక్స్‌ విజయవంతంగా ముగిశాయి. ఈ ఒలింపిక్స్‌లో 10 దేశాలకు తొలిసారి స్వర్ణం కల సాకారమైంది. దీనిలో ఓ అథ్లెట్‌ స్వతంత్రంగా స్వర్ణం సాధించాడు. వివరాలు…
1. బహ్రెన్‌కు చెందిన రుత్‌ జెబెట్‌ మహిళల స్టీపుల్‌ఛేజ్‌లో గెలుపొంది ఆ దేశానికి తొలి స్వర్ణాన్ని సాధించింది.
2. రియో ఒలింపిక్స్‌లో ఫిజి అద్భుతమే చేసింది. పురుషుల రగ్బీ ఫైనల్లో ఘన విజయం సాధించి ఆ దేశానికి తొలి స్వర్ణం అందించింది.
3. కువైట్‌లో సైనికాధికారిగా పనిచేస్తున్న ఫెహైద్‌ ఆల్‌ ఢీహని డబుల్‌ ట్రాప్‌ షూటింగ్‌లో స్వతంత్రంగా పాల్గొని స్వర్ణం సాధించాడు.
4. జోర్డాన్‌కు చెందిన అహ్మద్‌ అబుఘోష్‌ తైక్వాండోలో స్వర్ణం సాధించి ఆ దేశ పదేళ్ల కలను నెరవేర్చాడు.
5. మజ్లిండా కెల్మెండీ మహిళల జోడో పోటీలో గెలిచి కొసావోకుతొలి స్వర్ణం అందించింది.
6. ప్యూర్టో రికో దేశానికి చెందిన మోనిక ఫ్యూగ్‌ మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌లో విజేతగా నిలిచి ఆ దేశానికి తొలి స్వర్ణం అందించిన అథ్లెట్‌ అయ్యాడు.
7. సింగపూర్‌కు చెందిన స్కూలింగ్‌.. పురుషుల 100మీ బటర్‌ఫ్లైలో మైకెల్‌ ఫెల్ప్స్‌ను ఓడించి దేశానికి తొలి స్వర్ణం అందించాడు.
8. తజకిస్థాన్‌కు చెందిన డిషోద్‌ నజరోవ్‌ పురుషుల హ్యమర్‌ త్రోలో స్వర్ణం గెలిచి ఆ దేశానికి తొలి స్వర్ణం సాధించిపెట్టాడు.
9. వియత్నాంకు చెందిన హొంగ్‌ జువాన్‌ విన్హ్‌ 10మీ ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో ఆ దేశానికి తొలి స్వర్ణం అందించాడు.
10. చీక్‌ సల్లాహ్‌ జూనియర్‌ తైక్వాండోలో స్వర్ణం గెలిచి కొటే డిల్వొయిర్‌ దేశానికి తొలి స్వర్ణాన్ని అందించాడు.