*తోక ముడిచిన మంత్రి మల్లారెడ్డి* – పాలపాటి ప్రవీణ్ కుమార్, మునగాల మండల కాంగ్రెస్ పార్టీ సహాయక కార్యదర్శి

మునగాల, జూన్ 02(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర అధికారిక బఫూన్ మంత్రి మల్లారెడ్డి ఎట్టకేలకు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ సహాయక కార్యదర్శి పాలపాటి ప్రవీణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే కాంగ్రెస్ పాలనలో తన సొంత ఆస్తులకాపాడటానికి, కాంగ్రెస్ తో పెట్టుకుంటే జైలు జీవితం తప్పదని ముందస్తుగా మేల్కొని రాజీనామా డ్రామాకు తెరదీశాడని పాలపాటి ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రతీ ప్రెస్ మీట్ లల్లో కేవలం రేవంత్ రెడ్డిని తిట్టడం, కేసీఆర్ పాలనను పొగడటం పనిగట్టుకోవటం వల్ల ప్రజలు విసుగుచెంది చెప్పులు విసిరారన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇక రాష్ట్రంలో తిరిగే పరిస్థితులు లేవని, తన స్వప్రయోజనాల కోసం రానున్న కాలంలో ప్రతిపక్ష హోదాలో ఉండే టీఆర్ఎస్ పార్టీ కూడా తన అక్రమ ఆస్తులను, భూ కబ్జాలను, అక్రమాలను, అవినీతిని కాపడలేదని గ్రహించి రాజీనామా చేశారని అన్నారు. మల్లారెడ్డి రానున్న రోజుల్లో కనీసం కొంతమేర శిక్ష తగ్గించుకోవడానికైనా అప్రువర్ గా మారే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి బంగారు బాతు కథ వలే చేశాడని, అబద్ధాలతో రాష్ట్ర పాలన చేయలేరని, ప్రజలు సమస్తం గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెప్పడానికి ఎదురు చూస్తున్నారని అన్నారు.