త్వరలో ఐకాస పాదయాత్ర : కోదండరాం
మెదక్: మంత్రులపై ఒత్తిడి పెంచేందుకు వారి నియోజకవర్గాల్లో త్వరలో ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర చేయబోతున్నట్లు తెలంగాణ ఐకాస ఛైర్మన్ ప్రొ. కోదండరాం తెలియజేశారు. తెరాసతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని, ఉద్యమాన్ని ఉద్థృతం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ కార్యచరణను త్వరలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ కార్యచరణను త్వరలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణపై షిండే చేసిన వ్యాఖ్యాలు సంతృప్తికరంగా లేవని కోదండరాం వ్యాఖ్యానించారు.