థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కేటాయించండి:కేసీఆర్
హైదరాబాద్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో నిర్మిస్తోన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కేటాయించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. నార్త్ గ్రిడ్ నుంచి సౌత్ గ్రిడ్‌కు కారిడార్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ అడిగిన అంశాలపై ప్రత్యేక దృష్టిపెడతామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.