థాకరే అంతిమయాత్ర ప్రారంభం
ముంబయి: శివసేన అధినేత బాల్ థాకర్ అంతిమ యాత్ర ఆయన నివాసం మాతోశ్రీ నుంచి ఈ ఉదయం ప్రారంభమైంది. అంతిమయాత్ర కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనం వెంట భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలారు. అంతిమయాత్ర మాతోశ్రీ నుంచి దక్షిణ ముంబయి మీదుగా శీవాజీ పార్కుకు చేరనుంది, సాయంత్రం 6 గంటలకు పార్కులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.