థియేటర్ల తినుబండారాల ధరలకు చెక్‌

భద్రాది కొత్తగూడెం,జూలై28(జ‌నం సాక్షి): సినిమాహాళ్ల యాజమానులతో చర్చలతో ఇక తినుంబడారాల అమమకాల్లో మార్పులు రానున్నాయి. అధికా ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించన నేపథ్యంలో మార్పు కనిపిస్తోంది. జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి కే.మనోహర్‌ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా వ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్ల యజమానులు, నిర్వాహకులతో ప్రత్యే క సమావేశం ఏర్పాటు చేశారు. ఈసమావేశంలో జిల్లాలోని 21 థియేటర్ల యజమానులు, ప్రతినిధులు పాల్గొన్నారు. వారితో ధరలపై ప్రత్యుకంగా చర్చించారు. వినోదం కోసం వెళ్లిన ప్రేక్షకులపై సిని మా థియేటర్లలో తినుబండారాలు,కూల్‌ డ్రింక్స్‌, ఇతర ఆహార పదార్థాలకు సంబంధించి ఏది కొన్నప్పటికీ అధిక రేట్లకు విక్రయిస్తూ ప్రేక్షకులపై మోపుతున్న భారానికి ప్రభుత్వం చెక్‌ పెట్టింది. కుటుంబంతో సినిమాకు వెళ్లిన వారికి సినిమా థియేటర్లలోని క్యాంటీన్లలో ఏమైనా తినుబండారాలు, కూల్‌డ్రింక్స్‌, వాటర్‌ బ్యాటిల్స్‌, ఇతరత్రా స్నాక్స్‌కొంటే ఎంఆర్‌పీ ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి కచ్చితమైన నిబంధనలను అమలు చేస్తూ అన్ని సినిమా థియేటర్ల యజమానులతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఏ విధమైన పద్ధతులను అవలంబించాలో తెలిపారు.