థెరిసా వర్థంతిలో నేతల నివాళి
గుంటూరు,సెప్టెంబర్5(జనం సాక్షి): మదర్‌థెరిసా 21వ వర్ధంతి సందర్భంగా బుధవారం గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో ఆమె విగ్రహానికి మంత్రి నక్కా ఆనందబాబు, నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్స్ తోచర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు మదర్‌థెరిసా చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. పేద ప్రజలు, నిస్సహాయుల కోసం మదర్‌థెరిసా ప్రపంచవ్యాప్తంగా అనేక సేవ కార్యక్రమాలు చేశారన్నారు. ఉన్నత ఆశయాల కోసం చిరకాలం జీవించిన వ్యక్తి మదర్‌థెరిసా అని మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.