దండోరా ముద్యమ నేత చంద్ర స్వామికి ప్రతిష్టాత్మక కాళోజీ సేవా పురస్కారం

అవార్డు అందజేస్తున్న వల్లూరి ఫౌండేషన్ సభ్యులు
ఆత్మకూర్ (ఎం) నవంబర్ 28 (జనంసాక్షి) మొరిపిరాల గ్రామానికి చెందిన దండోరా ఉద్యమ నేత నల్ల చంద్ర స్వామి మాదిగ కు ప్రతిష్టాత్మక కాళోజీ సేవా పురస్కారం అవార్డును హన్మకొండ జిల్లా టి టి డి కల్యాణ మండపంలో వల్లూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ రావు సినీ నటి గీతా సింగ్ చేతుల మీదుగా కాళోజీ అవార్డును ప్రశంస పత్రాన్ని అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కాళోజీ అవార్డు గ్రహీత నల్ల చంద్ర స్వామి మాదిగ మాట్లాడుతూ  పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది అని ఎలుగెత్తి చాటిన ప్రజాకవి పాలకుల నిరంకుశత్వాన్నీ నిలదీసిన ఉద్యమ కారుడు భాషాకవి అయిన కాళోజీ నారాయణ రావు పేరు మీద అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా గర్వంగా ఉందని అన్నారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసే అవకాశం రావడం తదనంతరం పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకోవడం జరిగింది అని అన్నారు దండోరా సామాజిక ఉద్యమంలో ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నాం అని ప్రజా సమస్యలే మా సమస్యలుగా నిత్యం ప్రజల్లో ఉంటూ వారిని చైతన్య పరుస్తున్నామని తెలిపారు మహానుబహుడు కాళోజీ పేరు మీద నాకు అవార్డు రావడం నా పూర్వ జన్మ సుకృతం లాగా భావిస్తున్న అని నన్ను ఈ కాళోజీ అవార్డుకు ఎంపిక చేసిన వల్లూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ రావు సినీ నటి గీతా సింగ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

తాజావార్తలు