*దక్షిణ పెద్ద కాశీగా వేములవాడ రాజన్న ..

   

దక్షిణ చిన్న కాశీగా..

ఉప్పులూరు శ్రీీ బాలా రాజరాజేశ్వర స్వామి*..

బాల్కొండ కమ్మర్పల్లి. ఆర్. సి . మార్చు 01( జనం సాక్షి):

నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలంలో  ఉప్పులూరు గ్రామం లో దక్షిణ కాశిగా ప్రసిద్ధి గాంచిన స్వయంభూగా వెలిసిన శ్రీ బాల రాజరాజేశ్వర స్వామి ఘనంగా పూజలు అందుకోనున్నారు. ఈ ఆలయం కాకతీయుల కాలంలో 12వ శతాబ్దంలో నిర్మింపబడిన  పురాతన ఆలయం. ఈ పుణ్య క్షేత్రం పారనికంగా చరిత్రాత్మకంగా పవిత్రతను సంతరించుకుంది. ఈ పురాతన ఆలయం లో శ్రీ బాల రాజరాజేశ్వర స్వామి తో పాటు గణపతి నందీశ్వరుడు నాగేంద్రుడు కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయంలో శ్రీ బాల రాజరాజేశ్వర స్వామి స్వయంభూలింగేశ్వరుడిగా వెలసినటు చరిత్ర చెబుతుంది. దేవ గురు బృహస్పతి ఆదేశానుసారం ఉప్పులూరు లో వెలసిన స్వయంభులింగం శ్రీ బాల రాజా రాజేశ్వర స్వామిని ప్రతి దినం ఉదయం ఈశాన్య భాగాన గల కొలను బావిలో నుండి శుద్ధ జలం తో శ్రీ స్వామి వారిని పూజలు చేసిన  శాప విమోచన కలుగును చెప్పెను ఇంద్రుడు అదే ప్రకారం శ్రీ స్వామి వారిని ఆర్జించిచేను బాల రాజేశ్వర స్వామి వారు ఇంద్రునకు స్వప్నంలో  సాక్షాత్కరించి ఉప్పులూరు గ్రామానికి తూర్పుగా 75 ఆమడల దూరంలో గల శ్రీ వేములవాడ ఈ క్షేత్రంలో వెలిసిన రాజరాజేశ్వర స్వామి గుండం కోనేరులో స్నానం ఆచరించి వృధా భిషేకం రోజు జరిపిన శాపవిమోచనం జరుగునని చెప్పెను ఇంద్రుడు ఆ విధంగా పూజించి బ్రహ్మత్యా పాతకము పోగొట్టుకొని అందువలన క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఉప్పులూరు నందు శ్రీ బాల రాజేశ్వర స్వామి అనే నామం వచ్చియున్నది….

*ఆలయ చరిత్ర*
 కమ్మర్ పల్లి మండలంలోని ఉప్పలూరు గ్రామం లో కొలువుదీరిన ఈ ప్రాచీన ఆలయ ప్రాముఖ్యతను కథలు కథలుగా చెప్పుకొంటున్నారు వ్యాసుని చే లిఖించిన భవిష్యోత్తర పునరుద్ధరణ ఈ క్షేత్ర వైభవం ప్రాచుర్యంలో ఉంది దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ప్రస్తుత సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పెద్ద స్వామి గా ఉప్పులూరు లో కొలువుదీరిన బాల రాజేశ్వర స్వామి చిన్నస్వామి గా క్షేత్ర ప్రాంత ప్రజలు ఇష్టదైవంగా కొలుస్తారు పూర్వం ఇంద్రుడు వృత్యాస్పండి ని వధించిన పిదప బ్రహ్మ హత్య పాతకాముతో బాధపడుతుండగా గా దేవ గురువు బృహస్పతి ఆదేశానుసారం ఈ క్షేత్రంలో శ్రీ బాల  రాజరాజేశ్వర స్వామిని అర్ధించి ఇక్కడి నుండి  పెద్ద స్వామి వేములవాడ క్షేత్రానికి వెళ్లి వంద సంవత్సరాలు తపస్సు చేసి  తన శక్తిని తిరిగి పొందుతాడని పురాణ కథలు కథలుగా చెప్పుకుంటారు ఉప్పులూరు లోని ఈ పుణ్యక్షేత్రాన్ని క్రీస్తు శకం నుండి క్రీస్తు శకం 900 మధ్య కాకతీయులు రాజులు నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెబుతుంది అత్యంత పురాతనమైన ఈ దేవాలయ నిర్మాణానికి వాడిన రాళ్లు రాతి స్తంభాలు గర్భగుడి ద్వారం శిల్పాలు అపురూప కళ నైపుణ్యానికి  నిదర్శనంగా నిలుస్తాయి గతంలో నిర్మించిన ఆలయ ముఖద్వారం నిటారుగా వెళ్లకుండా వంగి వెళ్లే మాదిరిగా ఉండేది  అయితే  ఈ ముఖద్వారం శిథిలాల వ్యవస్థకు చేరుకోవడంతో తో అత్యంత ఎత్తులో ఆకర్షణీయంగా నూతనంగా ఆలయ ముఖద్వారాన్నిి నిర్మించారు మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రామాభివృద్ధి కమిటీ ఆలయ అభివృద్ధిి  కమిటీలు ఆధ్వర్యంలో ఐదు రోజుుల పాటు జాతర ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు జాతర ఉత్సవాలకు పొరుగు జిల్లాల భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు మహా శివరాత్రికి ఐదు రోజులు ముందుగానే స్వామివారి పల్లకి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రతిరోజు రుద్రాభిషేకం శివ పంచాక్షరి జపం తీర్థ ప్రసాదాలు యజ్ఞఞ హోమ కార్యక్రమాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి కోరిిన కోరికలిచ్చే దైవంం గా స్వామి వారిని భక్తులుు కొలుస్తారు సంతానం లేనివారు శివరాత్రికి స్వామివారినిి దర్శించు కొని మూడు ఆంధ్ర రైస్ రాత్రులు ఆలయ ప్రాంగణంలో గడిపి ప్రత్యేక పూజలు చేస్తే సంతానం కలుగుతుందని ప్రసిద్ధి…..
*ఉప్పులూరు లో జాతర ఉత్సవాలు ప్రారంభం*…..
బాల రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని శివరాత్రి జాతర ఉత్సవాలకు సిద్ధం చేశారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకుడు పవన్ శర్మ తెలిపారు మహాశివరాత్రి రోజు ఉదయం గ్రామ కమిటీ సభ్యులు ఆలయంలో గ్రామ యోగక్షేమాలు కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం భక్తులకు ఆలయ ప్రవేశం కల్పిస్తారు నిషి పూజలు అర్ధరాత్రి స్వామివారికి వేద మంత్రోచ్ఛారణలతో బ్రహ్మ స్తోత్రములతో మహా పూర్వక రుద్రాభిషేకం పంచామృత అభిషేకం అనంతరం రథ బలి బలిహరణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు పిల్లలకు బెల్లం తో తులాభారం ఆవు దూడల తో ప్రదక్షిణలు పుష్కర స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం బెల్లం పంపిణీ చేస్తారు…
*పల్లకి సేవ*
శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని గ్రామంలోని వీధుల గుండా వారం రోజులపాటు సాయంకాలం పల్లకి సేవ కార్యక్రమం నిర్వహిస్తారు….
* రథోత్సవము*
పర్వదినం పురస్కరించుకొని  గ్రామంలో సాయంత్రం నుండి  రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ రధము నుండి గ్రామంలోని వీధుల గుండా తిరుగుతూ చివరకు ఆలయమునకు చేరుకుంటుంది రథం వచ్చే సమయంలో స్వామి వారికి మంగళ హారతులు ఇచ్చి భక్తులు  భగవంతుని దీవెనలు తీసుకుంటారు….
*జాగరణ*
పర్వదినం పురస్కరించుకొని ఆలయమునకు వచ్చిన భక్తులు రోజంతా భక్తిశ్రద్ధలతో ఉపవాసం  గా ఉండి రాత్రి వేళల్లో శివనామస్మరణతో జపిస్తూ మరుసటి రోజు స్నానమాచరించి పూజా కార్యక్రమాలు  నిర్వహించుకొని ఆలయంలో జరిగే అన్నదానం స్వీకరించి భక్తులు తిరుగు ప్రయాణం అవుతారు….
* రవాణా మార్గం*
నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉప్పులూరు గ్రామం లో గల శ్రీ బాల రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉంది ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు  మండల కేంద్రం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది…
*అన్ని ఏర్పాట్లు పూర్తి*..
పవన్ శర్మ ఆలయ ప్రధాన అర్చకులు…..
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి వచ్చే భక్తులకు మహిళలకు పిల్లలకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామని మరియు రధము ఊరేగింపు సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు గ్రామ అభివృద్ధి కమిటీ ఆలయ గ్రామాభివృద్ధి కమిటీ తీసుకుంటున్నారు