దమ్ముంటే నాపై పోటీచెయ్‌..

2

– కడియంకు ఎర్రబెల్లి సవాల్‌

వరంగల్‌,నవంబర్‌13(జనంసాక్షి):ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఒక్క హావిూని కూడా ప్రభుత్వం అమలుచేయలేదని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. ఏ హావిూ నెరవేర్చారని వరంగల్‌ ప్రజలు ఓటేయాలని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నెరవేర్చలేదనిఆరోపించారు. శుక్రవారం వరంగల్లో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించిన  సందర్భంగా ఎర్రబెల్లి విూడియాతో మాట్లాడుతూ… ఏం చేశారని టీఆర్‌ఎస్‌కు  ఓట్ల వేయాలని ప్రశ్నించారు. పత్తికి బోనస్‌ అడిగితే కేంద్రంపై నిందమోపి తప్పించుకుంటున్నారని విమర్శించారు. పక్కనున్న మహారాష్ట్రలో ఐదున్నర వేలు చెల్లింస్తుంటే కళ్లుమూసుకున్నారా అని ప్రశ్నించారు. పత్తికి బోనస్‌ ఇస్తున్నారో లేదో తెలుసుకునేందుకు టీఆర్‌ఎస్‌ నేతలకు దమ్ముంటే తనతో మహారాష్ట్ర రావాలని ఎర్రబెల్లి సవాల్‌ విసిరారు. వరంగల్‌లో ఉపఎన్నిక తెచ్చినందుకు టీఆర్‌ఎస్‌కు ఓటేయాలా? అని ప్రశ్నించారు. కేబినెట్‌లో దళితులు, మహిళలకు చోటేది? ఆయన నిలదీశారు. రాజయ్యను తొలగించినందుకు ఓటేయాలా అని అన్నారు.వరంగల్‌ పార్లమెంట్‌ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో మొదట సీఎం కేసీఆర్‌, మంత్రులు సమాధానం చెప్పాలని అన్నారు.  టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకు ఎన్నికల ముందు అనేకహావిూలు ఇచ్చి ఏ ఒక్కహావిూనికూడా నెరవేర్చలేదని,ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి వరంగల్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికల ద్వారా చెంప దెబ్బ కొట్టేందుకు సిద్దంగా ఉన్నారని, రైతు సమ స్యలు పట్టించుకోని టీఆర్‌ఎస్‌ మంత్రులు పోలీసులు, ఎస్కార్ట్‌ లేకుండా ప్రజల్లోకి వచ్చి ఓటు అడిగితే తరిమికొట్టేందుకు సిద్దంగా ఉన్నారని దయాకర్‌రావు అన్నారు. మహారాష్ట్రలో పత్తికి 5500 రూపాయల ధర చెల్లిస్తున్నారని… తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చెల్లించడం లేదని దయాకర్‌రావు ప్రశ్నించారు. మార్కెట్‌ యార్డులకు వస్తే మంత్రులను రైతులు బట్టలు విప్పికొట్టే పరిస్థితి నెలకొందని అన్నారు. కడియం శ్రీహరి తెలంగాణ సెంట్‌మెంట్‌తో గెలుపొందారని… ఇప్పుడు స్వతంత్య్ర అభ్యర్థిగా వరంగల్‌లో పాలకుర్తి..? లేదా ఎక్కడినుంచైనా నిలబడి గెలిచే సత్తా ఉందా..? అందుకు సిద్దమా..? నేనే సిద్దం..? అని దయాకర్‌రావు సవాల్‌ విసిరారు.  ప్రజాస్వామ్యాన్ని టీఆర్‌ఎస్‌ హత్యచేస్తోందని బీజేపీ నేత మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య, సమాధి చేస్తుందని  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  వరంగల్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, టీడీపీ పార్టీ నేతలు నగరంలోని ఓప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో విూడియాసమావేశం నిర్వహించారు.  తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పార్టీ ఉద్యమించిందని… అందుకు గుర్తింపుగా నేడు వరంగల్‌ పార్లమెంట్‌ ఉపఎన్నికల్లో ప్రజలుగుర్తించి గెలిపించాలని మురళీధర్‌ రావు అన్నారు.