దమ్ముంటే లగడపాటి చర్చకు రావాలి:వినోద్
వరంగల్:మెడికల్ సీట్ల కేటాయింపులో ఎంపీ లగడపాటి చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ నేత వినోద్‌కుమార్ తీవ్రంగా ఖండించారు.మెడికల్ సీట్ల కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు లగడపాటికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో రెండు,సీమాంధ్రలో రెండు మెడికల్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు.ఇప్పడు సీమాంధ్రలో 10 మెడికల్ కళాశాలలు ఉంటే తెలంగాణలో నాలుగు మాత్రమే ఉన్నాయన్నారు.తెలంగాణలో ఉన్న ప్రైవేటు మెడికల్ కళాశాలలన్ని సీమాంధ్ర మేనేజ్‌మెంట్ అధిపత్యంలో ఉన్నాయని పేర్కొన్నారు.