దళితవాడల్లో కేంద్ర పథకాల వివరణ
వనపర్తి,జూన్8(జనం సాక్షి): కేంద్ర పథకానలు వివరించడంతో పాటు దేశంలో బిజెపి పాలన వల్ల కలిగినలాభాలను వివిరిస్తే దళిత వాడల్లో బిజెపి నిద్రా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. మే 30 నుండి జూన్ 12 వ తేదీ వరకు విశిష్ట సంపర్క యోజన లో భాగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 116 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో దళిత వాడలను సందర్శించి, వారితో మమెకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని భాజపా రాష్ట్ర మహిళ మోర్చ ఉపాధ్యక్షురాలు యమనా పాఠక్ అన్నారు. వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను గూర్చి వివరించటం జరిగిందని అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని వివిధ గ్రామాల్లోని దళిత వాడలను ఆమె సందర్శించారు. ముఖ్యంగా మహిళల కొరకు మోది ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఈసందర్భంగా విూడియా సమావేశంలో వివరించారు. కార్యక్రమంలో భాజపా వనపర్తి జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.