‘ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తమని టీఆర్‌ఎస్ ప్రకటించింది’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళతుడిని సీఎంగా చేస్తమని టీఆర్‌ఎస్ ప్రకటించిందని టీఆర్‌ఎస్ శాసనసభా పక్షానేత ఈటెల రాజేందర్ అన్నారు. దేశంలో ఏ పార్టీ ప్రకటించని విధంగా టీఆర్‌ఎస్ దళితుడిని సీఎం చేస్తమని ప్రకటించిందని ఆయన గర్వంగా చెప్పారు. ఇవాళ ఆయన శాసనసభలో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 65 ఏళ్లు గడిచినా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధిక, సామాజిక సమానత్వం సిద్ధస్తేనే ఎస్సీ, ఎస్టీ , బీసీ కులాలకు మనుగడ ఉంటుందని ఆయన తెలియజేశారు.