దళితులు రాజకీయంగా ఆర్థికంగా ఎదగడం దళిత బంధు ముఖ్య ఉద్దేశం – ఎమ్మెల్యే కందాళ

కూసుమంచి ఆగస్టు 21 ( జనం సాక్షి ) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ఇటీవల మండలంలో  ఎంపికైన లబ్ధిదారులకు అందజేశారు. వారిలో రాజుపేట బజారుకు చెందిన మోదుగు వీరబాబు దళిత బంధు పథకం అందినది అతను నాయక్ గూడెం లోని అట్టి పథకాన్ని వినియోగించుకొని హోల్ సేల్ ఫ్యాన్సీ మరియు   కిరాణా షాపు పెట్టారు. అట్టి షాపును ఆదివారం రోజున స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్  రెడ్డి షాపు ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వలన దళితులు రాజకీయంగా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే దళిత సోదరులు ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ ఉద్దేశంతోటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బందు పథకాన్ని ఉపయోగించుకొని దళిత సోదరులు ఆర్థిక ఎదగాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కాసాని సైదులు, ఉపసర్పంచ్ కిన్నెర శ్రీకాంత్, మండల పరిషత్ అధ్యక్షులు బానోతు శ్రీనివాస్ నాయక్, డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్, జిల్లా తెరాస నాయకులు సోలిపుర జయచంద్రా రెడ్డి, మండల అభివృద్ధి అధికారి కరుణాకర్ రెడ్డి, మండల తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.