దళితుల పై కులవివక్ష చూపొద్దు

రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలయ్య
లింగంపేట్ 30 జూలై (జనంసాక్షి)
దళితుల పై కులవివక్ష చూపొద్దని రెవిన్యూ ఇన్స్పెక్టర్ బాలయ్య అన్నారు.ఆయన శనివారం లింగంపేట్ మండలంలోని భవానిపేట్ గ్రామంలో పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమంలొ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గ్రామంలో అందరు స్నేహ భావంగా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని తెలిపారు.వాస్తవం మయితే తప్పా అనవసరంగా అట్రాసిటి కేసులు నమోదు చేసుకోవద్దని ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఏఎస్ఐ రంగారావ్ పేర్కొన్నారు.అనంతరం జిల్లా దళిత నాయకుడు నాగులూరి సాయిలు మాట్లాడుతు వ్యవస్థలో మార్పు రావడం కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టిన దళితులను చిన్నచూపే చూస్తున్నారన్నారు.గత 30 సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతంలోని హోటల్లో రెండు గ్లాసుల పద్ధతి ఉంటు దేవాలయాలకు రానిచ్చేవారు కాదని తెలిపారు.ఇప్పుడు అలాంటి విషయంలో మార్పు వచ్చినా ఉద్యోగాల పరంగా రాజకీయపరంగా దళితులను చిన్నచూపే చూస్తున్నారని గుర్తుచేసారు.వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడు సమాజం బాగుంటుంది.దళితులు బాగుంటారని ఆయన పేర్కోన్నారు.పౌరహక్కుల దినోత్సవంతొ పాట అవగాహణ సదస్సులు పెడుతు కులవివక్ష చూపేవారి పై చట్టాలు కఠినంగ తీసూక రావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పర్బన్న,గ్రామసర్పంచ్,కానిస్టేబుల్ ప్రసాద్ గౌడ్,కార్యదర్శి,గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పోచయ్య ఉపాధ్యక్షులు బ్యాగరి సాయిలు సాయిబాబా గ్రామస్తులు తదితరులు ఉన్నారు.