దళిత బందు లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

ఎంచుకున్న యూనిట్ తో సక్సెస్ కావాలి.
లబ్ధిదారులకు మండల స్థాయిలో ఓరియంటేషన్ నిర్వహించాలి
— జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్.
సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 15:(జనం సాక్షి):
జిల్లాలో దళితబంధు పథకంతో నెలకొల్పిన యూనిట్లను లబ్ధిదారులు విజయవంతంగా నడుపుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు.
శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో దళిత బంధు పథకం కింద నెలకొల్పిన వివిధ యూనిట్ల లబ్ధిదారుల స్థితి గతులు, యూనిట్ల అభివృద్ధి , లాభాల పురోగతి తదితర అంశాలపై అదనపు కలెక్టర్ రాజర్షి షా తో కలిసి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, దళిత బంధు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత బంధు యూనిట్లను మరింత అభివృద్ధి చేసుకోవడంతో పాటు  మరికొందరికి ఉపాధి కల్పించేలా లబ్ధిదారులు ఎదగాలన్నారు. అందుకు కావాల్సిన పూర్తి సహకారాన్ని ఆయా అధికారులు అందించాలన్నారు. లబ్ధిదారులు తాము తీసుకున్న యూనిట్ తో విజయవంతమై ఆర్థికంగా ఎదిగేలా చూడాల్సిన బాధ్యత ఆయా ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలదని తెలిపారు.
ఆయా యూనిట్లకు డబ్బు విడుదల చేసేటప్పుడు సమగ్రంగా యూనిట్ను పరిశీలించాలని ఎంపీడీవోలకు సూచించారు.
ఎంపీడీవోలు మండల స్థాయిలో ఓరియంటేషన్ నిర్వహించాలని, దళిత బందు యూనిట్ తో
సక్సెస్ అయిన వారితో, ఏ విధంగా విజయవంతంగా యూనిట్ నడుస్తుందన్న విషయాన్ని అందరికీ వివరించేలా మాట్లాడించాలన్నారు. అదేవిధంగా అవసరమైన లబ్ధిదారులకు సపోర్ట్ చేయాలన్నారు. రెగ్యులర్గా పర్యవేక్షించాలని సూచించారు.
  డెయిరీ యూనిట్లను డెయిరీ లకు టై అప్ చేసి లబ్ధిదారులకు రెగ్యులర్ గా ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. వివిధ యూనిట్లు నెలకొల్పిన లబ్ధిదారులకు ఏ విధంగా లాభదాయకంగా ఉంటుందో అధ్యయనం చేయాలని, ఆ మేరకు అవసరమైన సలహాలు , సహాయాన్ని అందించాలన్నారు. లబ్ధిదారులకు ఏది లాభదాయకంగా ఉంటుందో వాటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాక్షికంగా గ్రౌండింగ్ చేసిన యూనిట్లు పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయాలని సూచించారు.
 లబ్ధిదారులను కలిసి ముఖాముఖి మాట్లాడాలన్నారు. ఇచ్చిన యూనిట్ తో విజయవంతం అయింది, లేనిదీ మరోసారి సమగ్రంగా  పరిశీలించి నివేదిక నివ్వాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆయా యూనిట్లకు ఏదేని సహకారం అవసరమైతే ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
  లబ్ధిదారులు యూనిట్లను బాగా అభివృద్ధి చేసుకునేలా ఆయా అధికారులు చొరవ చూపాలన్నారు.
  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా,ఎస్సీ కార్పొరేషన్ ఈ డి బాబురావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు డి ఆర్ డి ఓ పిడి శ్రీనివాసరావు, డిపిఓ సురేష్ మోహన్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య,
డి సి ఓ ప్రసాద్, పరిశ్రమల శాఖ జిఎం ప్రశాంత్ కుమార్, వ్యవసాయ శాఖ జెడి నరసింహారావు, ఉద్యాన శాఖ అధికారి సునీత, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area