దళిత బంధు మాదిరిగానే కల్లుగీత కార్మికులందరికీ గీతన్న బంధు ప్రకటించాలి

ములుగు బ్యూరో,సెప్టెంబర్14(జనం సాక్షి):-
బుధవారం రోజున ములుగు మండలం బండారిపల్లి గ్రామంలోనీ తాటి వనంలో కల్లుగీత కార్మిక సంఘం సమావేశం  పొన్నం రాజు గౌడ్ అధ్యక్షత  జరుగగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన కల్లుగీత కార్మిక సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవి గౌడ్ మాట్లాడుతూ ప్రతి గీత కార్మికునికి గీతన్న బంధు ద్వారా 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని,తాటి చెట్టు పై నుండి ప్రమాదానికి గురైన గీత కార్మికులకు ఇచ్చే ఎక్స్ గ్రేషియా ఆలస్యం చేయకుండా నెల రోజుల్లో  ఇవ్వాలని  డిమాండ్ చేశారు.అలాగే కల్లుగీత కార్మికుడు తాటి చెట్టు పైనుండి ప్రమాదానికి గురైనప్పుడు  బిసి తాడి కార్పొరేషన్ నుండి వచ్చే ఆర్థిక తక్షణ సహాయాన్ని 15వేల నుండి 30 వేలకు పెంచాలనీ,మరణించిన కార్మికులకు 25వేల నుండి 50 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.అలాగే ప్రతి గీత కార్మికునికి టూ వీలర్ వెహికల్ అందించాలని అన్నారు.50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికులకు ఏలాంటి షరతులు లేకుండా కొత్త పింఛన్లలో నమోదు చేసి పింఛన్లు అందించాలని,తాడిచెట్టు పైనుండి  ప్రమాదానికి గురైన బాధితులకు మెడికల్ బోర్డు ద్వారా అందించే  మెడికల్ సర్టిఫికెట్ నిబంధనలను సులభతరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.అనాదిగా కల్లుగీత వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనోపాధి కొనసాగిస్తున్న ఏజెన్సీ కల్లుగీతా కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగస్వామ్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధిత ప్రజాప్రతినిధులు,ఎక్సైజ్ శాఖ అధికారులు సహకరించాలని ఆయన కోరారు. భవిష్యత్తు కార్యాచరణకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక జిల్లా నాయకులు కేక్కర్ల అశోక్ గౌడ్,పొన్నం సమ్మయ్య గౌడ్ మరియు సొసైటీ అధ్యక్షులు పొన్నం రాజు గౌడ్ కార్యదర్శి చంద్రగిరి సంతోష్ గౌడ్ మరియు కత్తి వెంకన్న గౌడ్ గున్నాల సదానందం గౌడ్, చంద్రగిరి బిక్షపతి గౌడ్, చంద్రగిరి సదయ్య గౌడ్, చంద్రగిరి నాగరాజు గౌడ్, పొన్నం రానా ప్రతాప్ గౌడ్, బుడిగే పెద్ద కుమారస్వామి పొన్నం సదయ్య గౌడ్, కేక్కెర్ల ఐలయ్య గౌడ్,గున్నాల రాములు గౌడ్,చంద్రగిరి పెద్దరాజయ్య గౌడ్,చంద్రగిరి కుమారస్వామి గౌడ్, గున్నాల బిక్షపతి గౌడ్, గున్నాల సుధాకర్ గౌడ్ ఇతరులు పాల్గొన్నారు.