దళిత బంధు యూనిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 25

దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకు వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేసారని మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.గురువారం అల్వాల్ సర్కిల్ లోని వెస్ట్ వెంకటాపురంలో దళిత బంధు లబ్ధిదారు గాయత్రి సబ్బికి ప్రభుత్వం ద్వారా వచ్చిన టాక్సీ కారును, ఆన్ లైన్, ఈ సేవ సెంటర్ కు  ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బందు పథకం ద్వారా అర్హులైన దళితులకు ప్రభుత్వం ద్వారా 10 లక్షల రూపాయలు అందించి, వారు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు పెట్టుబడిని సమకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు రాజ్ జితేందర్ నాథ్, సబితా అనిల్ కిషోర్, స్థానిక నాయకులు కొండల్ రెడ్డి, అనిల్ కిషోర్ గౌడ్, భాస్కర్, నాగేశ్వరరావు, దేవేందర్, ఈ లక్ష్మణ్, కన్న గౌడ్, బబ్లు, అరవింద్, ప్రవీణ్, మధుసూదన్, ప్రేమ్, అనంతుల సంతోష్, శోభన్, భవిత, జ్యోతి యాదవ్, కవిత, నీత గ్లోరీ, తదితరులు పాల్గొన్నారు.