దశాబ్ద కాలంలో 60 ఏండ్ల అభివృద్ధి

  • దేశానికే అన్నం పెట్టే ప్రాంతంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా
  • 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి నుండి
  • కాకతీయుల కాలం నుండి నిజాంపాలన చివరి వరకు సుభిక్షం
  • కాంగ్రెస్ చేసిన పాపానికి సమైక్య పాలనలో 600 ఏండ్ల వెనుకకు
  •  లక్షలాది మందిని కబళించినఫ్లోరోన్ భూతం
  • ఆ భూతం నుండి బయట పడేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది
  • నేతన్నల ఆకలి చావులు,ఆత్మహత్యల పాపం సమైక్య పాలకులదే
  • ఉద్యమ కాలంలో జోలె పట్టి ఆదుకున్న నేత కేసీఆర్
  • 2014 కు పూర్వం రక్తసిక్తం అయిన జిల్లా
  • స్వరాష్ట్రంలో సస్యశ్యామలం
  • పోచంపాడు కోసం ఐదు దశాబ్దాల ఎదురు చూపులు
  • ఆశలు వదులుకున్న రైతాంగం
  • ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మూడేండ్లలో కాళేశ్వరం జలాలు
  • మూసి మురికిని వదిలించిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్
  • సూర్యపేట పట్టణ ప్రజలకు మిషన్ భగీరథతో సురక్షితమైన త్రాగు నీరు
  • నొసలు చిట్లించినోళ్లే నోర్లు వెళ్లబెడుతున్నారు
  • ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతోటే సూర్యపేట జిల్లా ఏర్పాటు
  • పట్టణ సుందరీ కరణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరుణతోటే
  • రెండు మినీ ట్యాన్క్ బండల నిర్మాణం,పట్టణంలో బోటింగ్ ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చలువే
  •  మంత్రి జగదీష్ రెడ్డి
    సూర్యపేట జిల్లా జనం సాక్షి :    ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనీ రాష్ట్ర ప్రభుత్వం 60 ఏండ్లలో చెయ్యాల్సిన అభివృద్ధి ని కేవలం ఆరు ఏండ్లలోనే చేశారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు.2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలుపుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని అందుకు ఆయనకు సూర్యపేట జిల్లా ఋణపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సూర్యపేటను జిల్లాగా ఏర్పాటు చేయడమే కాకుండా అద్భుతమైన భవనాలు నిర్మించి పాలనను ప్రజలకు పాలనను చేరువ చేసిన ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రిదే నన్నారు.ఆదివారం సూర్యపేట జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్న ప్రగతి నివేదన సభలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు.కాకతీయుల కాలం నుండి నిజాంపాలన చివరి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేదని,కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంద్రప్రదేశ్ లో కలపడంతో సమైక్య పాలనలో 600 ఏండ్లు వెనక్కి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.వారు చేసిన పాపాలతో అన్నం పెట్టే రైతు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. వారి నిర్వాకం తోటే భూగర్భ జలాలుఅడుగంటడంతో బయటకు వచ్చిన
    ఫ్లోరిన్ భూతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్షలాది మందిని కబళించిందని ఆయన ఆరోపించారు.అంతే గాకుండా చేనేత కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే తట్టుకోలేక ఉద్యమ కాలంలోనే జోలె పట్టి వసూలు చేసిన మొత్తలతో నేతన్నలను ఆదుకున్న మహానేత కేసీఆర్ అని ఆయన కొనియాడారు. సూర్యపేట,తుంగతుర్తి,హుజుర్నగర్, మునుగోడు వంటి ప్రాంతాలలో జరిగిన రాజకీయ ఘర్షణలతో రక్తసిక్తం అయ్యాయని ఆయన చెప్పారు. అటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇప్పుడు యావత్ భారత దేశానికే అన్నం పెట్టే ప్రాంతంగా ఎడిగిందన్నారు.అందుకు స్వరాష్ట్రంలో సూపరిపాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమన్నారు.సూర్యపేట ప్రాంతం ఐదు దశాబ్దాలుగా పోచంపాడు జలాల కోసం నిరీక్షించి ఆశలు వదులు కున్నారన్నారు.దివంగత కమ్యూనిస్టు నేత భీమిరెడ్డి నరసింహా రెడ్డి పోరాడి పోరాడి నిస్సయాయులు అయ్యారన్నారు.అటువంటి తరుణంలో ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన మూడేండ్లలో ప్రపంచమే ఆశ్చర్యం చెందేలా కాళేశ్వరం పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యపేటను సస్యశ్యామలం చేశారన్నారు.కాళేశ్వరం జలాలతో మొట్ట మొదట లబ్దిపొందింది సూర్యపేట జిల్లాయో నన్నారు.ఆ జలాలు పారుతున్నందునే నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉన్న సూర్యపేట జిల్లా వరుసగా నాలుగేళ్ళ నుండి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేసే స్థాయికి చేరిందన్నారు.రైతాంగానికి ఆత్మవిశ్వాసం కలిపించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మించిన నేత మరొకరు ఉండరన్నారు.దశాబ్దాల తరబడి సమైక్య పాలనలో సూర్యపేట పట్టణ ప్రజలు తాగుతున్న మూసి మురికి నీటినుండి విముక్తి చేసి మిషన్ భగీరథతో సురక్షితమైన త్రాగునీరు అందుతుంది అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ మహిమనే నన్నారు.ఒక ప్రాంతం డ్రైనేజీ నీరు మరో ప్రాంతానికి త్రాగు నీరు ఎలా అవుతుందంటూ సనైక్య పాలనలో జలసాధన ఉద్యమ కారుడు దుశ్చర్ల సత్యనారాయణ నెత్తి నోరు పెట్టి మొత్తుకున్న ఉదంతాన్ని ఆయన యాది చేశారు.అటువంటి మూసి మురికిని మూడేండ్లలో వదిలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రజలపై తనకున్న అవిభాజ్యమైన ప్ర్రేమను చాటుకున్నారన్నారు.తెలంగాణా ఉద్యమ సమయంలో తెలంగాణా వస్తుందా అంటూ నొసలు చిట్లించిన వారే ఇప్పుడు నోర్లు వేళ్ళ బెడుతున్నారన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదాలతోటే ఈ రోజు సూర్యపేట జిల్లా ప్రజలు ఇంతటి అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారన్నారు. జిల్లా గా సూర్యపేట ను ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి సామాన్యుడికి అధునాతన వైద్యం అందుబాటులో ఉండేలా చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ యో నన్నారు.ఇంటిగ్రేటెడ్ మార్కెట్,సమీకృత ప్రభుత్వా కార్యాలయాల భవన సముదాయాలు,పోలీస్ కార్యాలయ భవనాలు నిర్మాణాలతో సూర్యపేట నాడు ఎట్లా ఉండే నేడు ఎట్లా మారింది అందుకు అధినేత అందించిన తోడ్పాటు కారణమన్నారు.సూర్యపేట పట్టణంలో మురికి కుపాలుగా మారిన రహదారులను కొత్తగా నిర్మించి రాష్ట్రంలో ఎక్కడా లేని విదంగా రెండు మినీ ట్యాన్క్ బండలను నిర్మించడంతో పాటు సద్దుల చేరువులో బోటింగ్ తో పట్టణ ప్రజలకు ఆహ్లాదం అందుతుంది అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహకారంతోటే అని ఆయన స్పష్టం చేశారు. అంతే గాకుండా హిందు,ముస్లిం,క్రైస్తవ లకై నిర్మించిన స్మశాన వాటికలు ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహకారంతోటే అన్నారు.దానికి తోడు జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన సూర్యపేట పట్టణ సుందరీకరణ తో పాటు పట్టణంలోనీ 14 పార్కుల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనీ తెలంగాణా రాష్ట్రంలో నే నన్నారు.