దసరా సెలవుల్లో వర్క్ షాప్ పేరుతో ప్రైవేట్ టీచర్లను హింసించే ప్రైవేట్ పాఠశాలలపై చేరియలు తీసుకోండి- భాస్కర్ రాథోడ్,

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం(జనంసాక్షి):- దసరా సెలువులల్లో తమకు ఉన్న కొద్దిపాటి సమయాన్ని కుటుంబసభ్యులతో గడపనివ్వకుండా, తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు, దసర పండుగా చేసుకొనివ్వకుండా , వర్కషాప్, ఒరియంటేషన్ ప్రోగ్రాం పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రైవేట్ టీచర్లను సూదురప్రాంతల నుంచి రప్పించుకొని రోజంతా మానసిక శోభకు గురిచేస్తున్నారని, అలాంటి పాఠశాలలపై చట్టపరమైన చేరియలు తీసుకొని అవసరమైతే నిబంధనలను అతిక్రమించినందుకు కేసులు పెట్టాలని  తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం- రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రాథోడ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్  మరియు డి ఈ ఓ  లకు వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు మనవతాదృక్పదంతో ఆలోచించి ప్రైవేట్ టీచర్లకు దసరా పండగ సెలవులు ఇవ్వాలని ఆయన ఒక ప్రకటనలో తెలియజేసారు.