దాడికి పిల్పడిన కీచకుడికి ఉరిశిక్ష వేయాలి
– బాధిత మహిళలకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ర్యాలీ
– మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్
– స్పందించిన పోలీసు అధికారులకు అభినందనలు తెలియజేసిన ప్రజాసంఘాలు.
మేడ్చల్ ప్రతినిధి ( వాయిస్ టుడే ) ఆగస్టు 7 :–. జవహర్ నగర్ ప్రదాన రహదారిపై అందరు చూస్తుండగానే సభ్య సమాజం తలదించుకునేల మహిళపై జరిగిన ఘటన పట్ల స్థానిక ప్రజలు, పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజా ప్రతినిధులు తీవ్రంగా మండిపడుతున్నారు సోమవారం రోజు బాదిత మహిళకు మద్దతు తెలుపుతూ రాజకీయాలకు అథీతంగా భారీ ర్యాలీ నిర్వహించి తమ మానవీయ విలువలను చాటుకున్నారు. వడ్డెర పెద్ద మారయ్య అనే వ్యక్తి, తన తల్లి నాగమ్మ ప్రోద్బలంతో ఒంటరిగా కాలినడకన వెళుతున్న మహిళపై లైంగిక చర్యకు పాల్పడి, ఆమేచేత మారయ్య చెంప దెబ్బ తిన్నాడు. అప్పుడే విపరీతమైన మద్యం మత్తులో ఉన్న తల్లి కొడుకు బాదిత మహిళపై విచక్షణా రహితంగా ప్రవర్తించారు. తన కుమారుడిని తల్లి రెచ్చగొట్టడంతో చేయ్యి చేసుకున్న మహిళా బట్టలను చించివేశాడు. వంటిపై బట్టలులేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. చుట్టూ ఉన్న అక్కడి జనం, అక్కడి ఘోర ఘటనను అడ్డుకోవడం మానేసి, తమ సెల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న తంతంగాన్ని మొత్తం వీడియో షూట్ చేసుకుంటున్నారని బాదిత మహిళా దుఃఖాన్ని దిగమింగుకొని తనకు జరిగిన అవమానకర విషయాలను వివరిస్తున్నప్పుడు
బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, ఆమ్ అద్మీ పార్టీ, సిపిఐ(ఎం.ఎల్) భహుజన, ముస్లిం కమిటీ, రియాన్ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం, జంబూద్వీప రాష్ట్ర సమితి, విశ్వకర్మ హక్కుల సాధన సమితి, ఐద్వా, మన స్నేహం, ఇఫ్టూ తదితర ప్రజాసంఘాల, పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, అక్కడికి హాజరైన ప్రజలు హ్రుదయాలు బరువెక్కాయి. పెద్ద మారయ్య లాంటి దుర్మాగులను అక్కడిక్కడే బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే మహిళలకు భద్రత అని గొంతెత్తి నినదించారు. తల్లిదండ్రులు లేని బాదిత మహిళ తన బందువుల సమక్షంలో ఉంటున్న మహిళకు అండగా మేము ఉంటాము అని సమిష్టిగా స్థానిక జవహర్ నగర్ పోలీసు స్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్ళి, తల్లి నాగమ్మ, కొడుకు మారయ్యను కఠినంగా శిక్షించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మారయ్య తమ్ముడు కానిస్టేబుల్ అని తెలిసి కూడా పక్షపాతాన్ని చూపకుండా జరిగిన ఘటనపై వెంటనే సకాలంలో స్పందించిన పోలీసు అధికారులకు అభినందనలు తెలియజేశారు. న్యాయం కోసం పోలీసు మెట్లు ఎక్కిన మేయర్ మేకల కావ్య, కార్పొరేటర్లు ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, యువరాజు లలిత, విజయలక్ష్మి, ఐద్వా విజయ, యాద లక్ష్మీ, అనంత లక్ష్మీ, రజిత, సునిత, బిర్రు యాకస్వామి, శివన్నారాయణ, ఎం.గీతాంజలి, ఎన్.జీ.ఓ.కావేరీ, దివ్యలత, పయ్యావుల లక్ష్మీ, అంబాల ఎల్లయ్య, ఎం.డి.పాషామియా, టి.కాలేషా, ఎర్ర యాదగిరి, మోఇన్, రాము, షేక్ షావలి తదితరులు బాదిత మహిళకు న్యాయం జరిగేంత వరకు అండగా నిలబడుతామని మనోధైర్యం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి మహిళకు తగిన ఆర్థిక, హార్దిక్ సహకారాలు అందించేలా స్థానిక ప్రజాప్రతినిధులు సమస్యను మంత్రి ద్రుష్టికి తీసుకెళ్ళి తగిన చేయుతను అందించేలా క్రుషి చేస్తామని తెలియజేశారు. స్థానిక పోలీసు అధికారులు కూడా బాదిత మహిళకు తగిన భద్రతను కల్పిస్తామని హామీ ఇచ్చారు