దాతలు ఆదుకుంటే డాక్టర్ అవుతా
రామన్నపేట నవంబర్ 10 (జనంసాక్షి) లక్ష్మీదేవి సరస్వతీదేవి ఒకేచోట నిలవరంటారు.శోభనాద్రిపురం గ్రామానికి చెందిన ఓ విద్యార్థి గాధ చూస్తే అది నిజమేననిపిస్తుంది. కటిక పేదరికం ఆ నిరుపేద విద్యార్థి పాలిట శాపంగా మారింది. చదువుకోవాలనుకున్న ఆమె కలకు పేదరికం అడ్డు గా మారింది.ఎవరైనా ఆర్థిక సాయం అందిస్తే చదువుకొని డాక్టర్ అవుతానంటోంది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామానికి చెందిన జంగిలి స్వామి మాములు వ్యవసాయ కూలి తల్లి రోజువారీ లేబర్. ఆర్థిక ఇబ్బందులు ఆ విద్యార్థిని చదువుకు ఆటంకంగా మారింది. కనీస ఫీజు తో పాటు ఇతర ఖర్చులకు డబ్బులు లేక అడ్మిషన్ తీసుకోలేకపోతుంది.మంచి కాలేజీ లో ఫ్రీ మెడికల్ సీట్ సాధించే అవకాశం ఉంది. కానీ అదే ఆర్థిక ఇబ్బందులు దివ్య కుటుంబాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే దాతల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తోంది. ఎవరైనా దాతలు సాయం చేసి తమ కూతురు చదువుకు అవకాశం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దేశంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. రోజుకు అనవసర ఖర్చులు కూడా ఎన్నో చేస్తారు. కానీ ఒక్క రూపాయి కూడా పేదవారికి పెట్టాలంటే వెనకడుగు వేస్తారు. చదువుకోవాలని తాపత్రయం ఉన్నా మనదేశంలో చదువును డబ్బుతో వెల కట్టారు కాబట్టి ఒక పేద విద్యార్థి చదువుకు డబ్బు అడ్డం వస్తోందని ఈ అమ్మాయిని చూస్తే అర్థం అవుతోంది.