దానం మళ్లీ మనసు మార్చుకున్నాడు

1
– కాంగ్రెస్‌లోనే కొనసాగుతారట!

హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 (జనంసాక్షి):  గ్రేటం హైదరాబా’ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దానం నాగేందం పార్టీ మారే వ్యవహారానికి తెరపడింది. దానం నాగేందం పొలిటికల్‌ హైడ్రామా క్లైమాచ్సీ లేకుండానే ముగిసింది.  తాను కాంగ్రెస్‌ పార్టీని వీడేది లేదనిస్పష్టం ఆయన మరోమారు చేశారు. సోమవారం ఆయన కాంగ్రెస్‌ను వీడి టిఆంఎస్‌లో చేరుతారనపి ప్రచారం సాగింది. ఇందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. పార్టీ మారనంటూనే గులాబీ దళపతితో టకలో ఉన్నారు. చివరకు  తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్‌ పక్ష నేత షబ్బీం అలీతో సోమవారం దానం మరోమారు భేటీ అయ్యారు. అనంతరం దానం నాగేందం మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీలో కొందరు నేతలు పొమ్మనలేక పొగ పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. గ్రేటం కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి  తప్పించాలని చూశారని, తనను తక్కువ చేయడం ..తన అనుచరులను బాధించిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వీడేది లేదని, ఇక నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. గ్రేటం ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి పని చేస్తానని దానం తెలిపారు. జీహెకఎంసీ ఎన్నికల కసరత్తు కోసం రేపట్నుంచి గాంధీభవన్‌లో సమావేశాలు జరుగుతాయన్నారు. ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేస్తామన్నారు.అయితే ముఖ్యమంత్రి కేసీఆం సమక్షంలో ఆయన తెరాసలో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. షబ్బీం అలీతో భేటీ ముగిసిన అనంతరం విూడియాతో దానం మాట్లాడుతూ… తనను తెరాసలో చేరాల్సిందిగా ఆ పార్టీ నేతలు కోరిన మాట నిజమేనన్నారు. కొంతమంది నేతలు తనను పార్టీని నుంచి పొమ్మనలేక పొగ పెట్టారని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీని వీడి తెరాసలో చేరనున్నట్లు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని దానం తేల్చిచెప్పారు. ఇకనుంచి పార్టీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని ,పార్టీ మారేది లేదన్నారు.  అంతా సవ్యంగా సాగితే సోమవారం మధ్యాహ్నం టీఆంఎస్‌లో చేరదామని ఆదివారం ఉదయం పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చిన ఆయన… మధ్యాహ్నానికల్లా మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు. మనమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగుద్ణాం అని వారికి చెప్పినట్లు సమాచారం. దీంతో ఖైరతాబా’ నియోజకవర్గ శ్రేణులు పూర్తి అయోమయానికి గురయ్యాయి. దానం టీఆంఎస్‌లో చేరే సందర్భంలో తాను ఆహ్వానించి కండువా కప్పలేనని, ఒక వేళ నగర మంత్రులు, ఇతర ముఖ్యనాయకుల సమక్షంలో ఆయన చేరితే అభ్యంతరం లేదని టీఆంఎస్‌ అగ్రనేత కెసిఆం స్పష్టం చేసినట్టు తెలిసింది. దీనికి పెద్దగా అట్టహాసం/ చేయదల్చుకోలదన్న భావనలో కెసిఆం ఉన్నట్లు సమాచారం. దీంతో దానం మనసు మార్చుకున్నట్లు సమాచారం. తాను అగ్రనేత సమక్షంలో అయితేనే పార్టీలోకి వస్తానని, ఇతరులైతే రాలేనని… దానం సైతం మధ్యవర్తులకు తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని పార్టీలోని ఒకరిద్దరు సన్నిహితులతోనూ ఆయన చర్చించి, తానిక కాంగ్రెస్‌లోనే కొనసాగుతానంటూ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇదిలావుంటే షబ్బీంతో రెండో దఫా చర్చల తరవాత దానం మనసు మార్చుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం గ్రహణం పట్టిందని… త్వరలోనే తిరిగి పుంజుకుంటుందని తెలంగాణ కాంగ్రెస్‌ శాసనమండలిలో కాంగ్రెస్‌ పక్ష నేత షబ్బీం అలీ అన్నారు. విపక్షాలపై తెరాస మైాం గేమ్‌ ఆడుతోందని విమర్శించారు. ఇతర పార్టీల నేతలను కొనేసి… పరిపాలిస్తామంటే ప్రజలు మెచ్చుకోరన్నారు. కేసీఆం కిరాయి నేతలతో ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నారని ఆరోపించారు.   దానం నాగేందం తమ పార్టీలో చేరుతున్నారంటూ టీఆంఎస్‌ నేతలు ఓ పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వరంగల్‌ లోచీసభ ఉప ఎన్నికలో ఓడినంత మాత్రాన కాంగ్రెస్‌ డీలా పడదని షబ్బీం అన్నారు. రాజకీయంగా లబ్ది కోసమే టీఆంఎస్‌ ప్రచారం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా దానం నాగేందం కారు ఎక్కేందుకు సిద్ధమై  చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానం సోమవారం ఉదయం షబ్బీం అలీ నివాసానికి వెళ్లారు. సుమారు అరగంటపాటు వీరి భేటీ జరిగింది.