దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి

– బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు నాగపూరి కిరణ్ గౌడ్
హలో బీసీ ఛలో ఢిల్లీ వాల్ పోస్టర్లు ఆవిష్కరణ
చేర్యాల (జనంసాక్షి) జులై 29 : బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు నాగపూరి కిరణ్ గౌడ్ అన్నారు. శుక్రవారం చేర్యాల పట్టణంలోని స్థానిక అంగడి బజార్ అంబేద్కర్ విగ్రహం చౌరస్తాలో ఆగస్టు 7,8,9వ తేదీలలో హలో బీసీ ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలకు దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలు ఎంత ఉన్నారో అంత వాటా కోసం బీసీలు అందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఛలో ఢిల్లీ కార్యక్రమానికి రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జనగామ జిల్లా ఇంచార్జ్ వేముల విద్యాసాగర్, శివగారి అంజయ్య, అందె అశోక్, సుంకరి శ్రీధర్ గౌడ్, ఎలికట్టె శివశంకర్ గౌడ్, చింతల పరశురాములు,తీగల సిద్దూ గౌడ్, జంగిడి సిద్ధులు, ఎండీ. దస్తగిర్, యాట భిక్షపతి, ఈరి భూమయ్య, పచ్ఛిమడ్ల సాయికుమార్ గౌడ్, ఇప్పకాయల వెంకటేశం, కర్రె రవి, చింతకింది చంద్ర శేఖర్, సాగర్ గౌడ్, పుల్లన్నగారి రాజు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area