దారుణం: హాస్టల్లో బిడ్డలకు జన్మనిచ్చిన ఇద్దరు మైనర్ బాలికలు
న్యూఢిల్లీ జనంసాక్షి : ఓడిషాలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ వసతి గృహంలో ఉండి చదువుకుంటున్న ఇద్దరు మైనర్ బాలికలు ప్రసవించారు. ఈ సంఘటన ఓడిషాలోని కోరాపుత్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఉమ్రి ఆశ్రమ స్కూలులో ఆరవ తరగతి చదవుతున్న ఓ మైనక్ బాలిక ఫిబ్రవరి 4న బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన జరిగిన 12 రోజుల తర్వాత సరిగ్గా అలాంటి స్కూలుకి సంబంధించి కందమాల్ జిల్లాలో పదో తరగతి చదువుతున్న మరో విద్యార్ధిని కూడా బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బాలికలు ఈ దుస్ధితికి కారణమై వారికి కనీస ఆరోగ్య సౌకర్యాలు అందించడంలో విఫలమైన స్కూలు ప్రధానోపధ్యాయుడు కైలాష్ చరన్ బ్రహ్మాతో పాటు హాసట్ల్ సూపరిడెంట్ సబితా గురుని అదుపులోకి తీసుకుని సోమవారం కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇక విషయంపై శనివారం సాయంత్రం ఫిర్యాదు అందుకున్న కోరాపుత్ జిల్లా కలెక్టర్ యామిని సారంగి స్కూలుపై దర్యాప్తుకి ఆదేశించారు. స్కూలు ప్రధానోపధ్యాయుడు తెలిపిన వివరాల ప్రకారం బాలిక తండ్రి రోజు వారీ కూలీ, గత ఏడాదే స్కూల్లో చేరినట్లు పేర్కొన్నాడు. దారుణం: హాస్టల్లో బిడ్డలకు జన్మనిచ్చిన ఇద్దరు మైనర్ బాలికలు లిఖిత పూర్వకంగా బాలిక ఫిర్యాదు చేయడంతో ఫిబ్రవరి 3న బాలిక గర్భవతి అన్న విషయం తెలిసిందని తెలిపారు. బాలిక సమీప బంధువే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అని ఆ లేఖలో పేర్కొందని తెలిపారు. హాస్టల్ పరిధిలో ఉన్న ఆడ వంటమనిషి రూమ్‌లోకి వెళ్లి బిడ్డను ప్రసవించినట్లు పేర్కొన్నారు. కోరాపుత్ సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్రి ఆశ్రమ స్కూలులో 570 మంది విద్యార్ధులు చదవుకుంటున్నారు. ఈ స్కూలు ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు విద్యను అందిస్తుంది. ఎస్టీ, ఎస్సీ విద్యార్ధలు కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం కల్పించిన వసతి గృహాంలో సుమారు 300 మంది ఉండగా, అందులో 150 వరకు విద్యార్ధినులు ఉన్నట్లు తెలిపారు. ఇక కందమాల్ జిల్లాలో పదో తరగతి చదువుతున్న మరో విద్యార్ధిని గర్భవతికి కారణమైన వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.