దాసరపల్లి లో పల్లెనిద్ర కార్యక్రమం

మల్దకల్ ఆగస్టు 17 (జనంసాక్షి) నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మల్దకల్ మండలం దాసరపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెనిద్ర కార్యక్రమం మంగళవారం రాత్రి నిర్వహించారు.
గ్రామంలోని ప్రజలు పలు సమస్యలపై నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్ కుమార్ బుధవారం ఉదయం గ్రామంలోని పలు వీధుల గుండా తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. దాసరపల్లినుండి బిజ్వారానికి ఎమ్మెల్యే గెలిచిన తక్షణమే బి.టి రోడ్డు వేయిస్తనన్న హామీ మరిచిపోయారని ప్రజల ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ గ్రామ ప్రజలు తమ నిత్య అవసరాల కోసం ఎక్కువగా ధరూర్ కు వెళ్తుంటారు, గ్రామం నుండి భూరెడ్డిపల్లి దాకా కూడా రోడ్డు కావాలని డిమాండ్ చేశారు.పాఠశాల భవనం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పిడికెడు మట్టి కూడా తీయలేదు,డంపింగ్ యార్డ్ కోసం ఏర్పాటు చేసిన చోట కాకుండా ఊరి పక్కనే చెత్తను డంపింగ్ చేయిస్తున్న సర్పంచ్
పాఠశాల భవనం ముందర కట్టిన బాత్ రూం నేటికి కూడా విద్యార్థులకు వినియోగంలోకి రాలేదు.ఊర్లో పాత భవనాల కూల్చివేయకుండా అట్లనే ఉన్నాయి.ఊర్లో వీధులగుండా మురుగునీరు పారుతూ అపరిశుభ్రమైన పరిస్థితి ఉంది.
సవారమ్మ అవ్వ గుడి ముందర తవ్విన గుంత ప్రమాదకరంగా ఉంది.చిన్నపిల్లలు పడితే చాలా పెద్ద ప్రమాదకరం.
శ్మశాన వాటికలో నిర్మించిన షెడ్డ్ అన్నీ గ్రామాలలో సిమెంట్ స్లాబ్ వేస్తే ఇక్కడ కేవలం రేకులతో నిర్మించారు.
ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా చెత్త కోసం ట్రాక్టరు వస్తే ఇక్కడ రెండు లేదా మూడు రోజులకు ఒకసారి రావడం గమనార్హం.
పాఠశాల పక్కనే ఉన్న బావి ప్రమాదకరంగా ఉంది.
ఈ గ్రామంలో అనేక రకాలైన సమస్యలు తాండవిస్తున్న గ్రామ సర్పంచ్ మాత్రం తనకేమి పట్టనట్లు వ్యవహారిస్తున్నాడు.
గ్రామంలో ఉదయం వీధులన్ని తిరిగి ప్రజలతో మాట్లాడుతూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యల సాధనకు ఖచ్చితంగా పై అధికారుల దృష్ఠికి తీసుకపోయి సమస్యల పరిష్కరం దిశగా పోరాటం చేస్తామన్నారు.ఈ పల్లెనిద్ర కార్యక్రమం లో రాత్రి గ్రామంలోని బసచేశారు.ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుచ్చిబాబు,లవన్న, అవని శ్రీ తిమ్మప్ప,లక్ష్మన్న రంగస్వామి,రాముడు,రమేష్,సర్వేష్,శేఖర్ పరుశ రాముడు,గోపాల్ ,రాజు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.