*దిగుబడిలో మేటి సోనమ్ సీడ్స్ వారి వరి సీడ్*

మునగాల, నవంబర్ 04(జనంసాక్షి): వరి దిగుబడిలో
అగ్రగామిగా పరిశోధిత సోనమ్ సీడ్స్  విత్తనం మంచి సత్ఫలితాలను ఇస్తుందని సోనమ్ సీడ్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ జి.ఎన్.వి రామకృష్ణ అన్నారు. రేపాల గ్రామంలో సోనమ్ సీడ్ వేసిన పందిరి పుల్లారెడ్డి, పందిరి శేషిరెడ్డి పంట తీరును పరిశీలించడానికి శుక్రవారం క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ, 15 ఏళ్ల క్రితం ప్రారంభించిన దొడ్డు రకం సీడ్ రకానికి చెందిన సోనమ్ సీడ్స్  రకం రైతులకు మంచి లాభాలను ఇస్తుందన్నారు.
వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రులు శాస్త్రవేత్తలు ఎన్నో రకాల ప్రయోగాలు చేసిన తరవాత దీనిని ప్రాంతాలను బట్టి, భూసారాన్ని అనుకూలంగా రూపొందించి మార్కెట్లో పెట్టి రైతులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. సోనమ్
అధిక బరువుతో పాటు, ఎకరానికి 40 నుండి 45 బస్తాల ధాన్యంతో అధిక దిగుబడిని ఇస్తుందన్నారు. ఎఫ్.సి.ఐ నిబంధనల పెరకు ఏ గ్రేడ్ లో అమ్మకమయ్యే విధంగా ఉంటుందని అన్నారు. అనంతరం రైతులు పందిరి పుల్లారెడ్డి, శేషిరెడ్డి మాట్లడుతూ, ఈ సీజన్ లో తాము సోనమ్ సీడ్ వరి విత్తనాలు పెట్టామని, ఇప్పటి వరకు పంట బాగా ఉందని, పంటలకు వాడే క్రిమి సంహారక మందులు కూడా తక్కువ మోతాదులో వాడామని, కంకి కూడా బాగా వచ్చిందని, సుమారు 40 నుండి 45 బస్తాల దిగుబడి వస్తుందని తెలిపారు. దొడ్డు రకం సీడ్స్ లో సోనమ్ మేలు రకంగా ఉందని, రైతు వారీగా ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సోనమ్ సీడ్స్ ఎండి జి.ఎం.వి రామకృష్ణ, మొగిలిచర్ల వెంకటేశ్వర్లు, సేల్స్ మేనేజర్, అయ్యప్ప ఫెర్టిలైజర్ ప్రొప్రైటర్ ఆలగడప ఠాగూర్, మన గ్రోమోర్ రీజనల్ మేనేజర్ తిరుపతిరెడ్డి, ఆలగడప రమేష్, గ్రామ రైతులు పందిరి పుల్లారెడ్డి, శేషిరెడ్డి, గండు కాశయ్య, సారిక చిన్నరామయ్య, చెవుల నరేందర్, గండు సత్యనారాయణ, వరికల చంద్రయ్య తదితరులు   పాల్గొన్నారు.