దిలీప్ కుమార్‌కు పద్మభూషణ్
– ఇంటివద్దే ప్రదానం చేసిన రాజ్‌నాథ్
ముంబాయి,డిసెంబర్13,(జనంసాక్షి):బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్‌ను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డ్ తో గౌరవించింది. చెన్నైలో భారీ వరదలు జనజీవనాన్ని
ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో ఈ సారి తన పుట్టినరోజును ఘనంగా నిర్వంచవద్దని అభిమానులను కోరిన దిలీప్ కుమార్ ఆ రోజు కూడా కేవలం తన ఇంటికే పరిమితమయ్యారు. ఈ శుక్రవారమే ఆయన పుట్టిన రోజు జరిగింది.కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బయటికు రాని దిలీప్‌కుమార్‌కు ప్రభుత్వం తరుపున కేంద్రమంత్రి
రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డ్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు
పాల్గొన్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఆయన్ను పద్మ విభూషణ్ అవార్డ్ తో గౌరవించింది.