దిల్లీలో 46వ గవర్నర్ల సదస్సు ప్రారంభం

దిల్లీ: దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో 46వ గవర్నర్ల సదస్సు ప్రారంభమైంది. సదస్సుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతర్గత భద్రత, ఈశాన్య రాష్గాల అభివృద్ధి, పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, అన్ని రాష్గాల గవర్నర్‌లు పాల్గొన్నారు.