దివంగత ప్రధాని ఇందిరాకు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ,అక్టోబర్31(జనంసాక్షి): మాజీ ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 31 వర్ధంతి సందర్భంగా నేతలు ఆమెకు నివాళులర్పించారు. ఇందిరాగాంధీ స్మారకం శక్తిస్థల్ వద్ద పుష్పగుచ్చం ఉంచి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నివాళులర్పించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తదితరులు ఇందిరాగాంధీకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. శ్రీమతి ఇందిరాగాంధీ జాతికి చేసిన సేవలను గుర్తు చేశారు.
ఇందిరకు కాంగ్రెస్ ఘననివాళి
ఇందిరాభవన్‌లో ఇందిరాగాంధీ వర్ధంతి, వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పిసిసి చీఫ్ రఘువీరా, కేవీపీ, పలువురు నేతలు హాజరయ్యారు. భారత్‌ను సుస్థిరమైన దేశంగా నిలిపిన ఘనత ఇందిరాగాంధీదేనని నేతలు చెప్పారు. హస్తం గుర్తుతో అభయం ఇచ్చిన ఉక్కు మహిళ ఇందిరా అని వారు అభివర్ణించారు. బీజేపీ చేసే పనులకు, పటేల్ ఆశయాలకు పొంతన లేదనీ, పటేల్ పేరు చెప్పే అర్హత బీజేపీకి లేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరా విమర్శించారు. ఇదిలావుంటే గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్నేతలు ఇందిరకు ఘనంగా నివాళి అర్పించారు. పిసిసి చీప్‌ఉత్తమ్ తదితరులు ఆమె చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఇందిర వల్లనే దేశం ఇవాళ పటిష్టంగా ఉందన్నారు. అలాగే అనేక సంక్షేమకార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారన్నారు. నెక్‌ఎలస్రోడ్డులో ఇందిర విగ్రహానికి పూలమాలలు వేసినివాళి అర్పించారు.