దివ్యంగుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలెక్టర్
దివ్యాంగుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
శనివారం నాడు జిల్లా కలెక్టరేటు మీటింగ్ హాలులో జిల్లా మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ అధ్వర్యంలో జిల్లా కలెక్టరు అధ్యక్షతన జిల్లా దివ్యాంగుల కమిటీ సమావేశమైంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్ని శాఖల సమన్వయంతో దివ్యాంగుల సమస్యలను తీర్చడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో సదరన్ స్లాట్ సమస్యలను అధిగమించడానికి జిల్లా మొత్తంగా డిసెంబరు ఒకటవ తేదీన జిల్లాలో సదరన్ లేని వారందరికి ప్రత్యేకంగా క్యాంప్ నిర్వహించబడుతుందని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు ప్రాధాన్యతనిస్తామని, జిల్లాలో ఓటు హక్కు లేని దివ్యాంగులను గుర్తించి వారికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటామని, స్వయం ఉపాధికి ముందుకొచ్చే దివ్యాంగుల కు ప్రత్యేక శిక్షణ కల్పించి బ్యాంకుల ద్వారా ఋణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని, బస్ పాస్ రాయితీ కోసం ప్రత్యేకంగా ఆర్టీసికి లేఖ వ్రాయడం జరుగుతుందని, ఉపాధి హామీ జాబ్ కార్డుల కోసం ప్రతి పదిహేను రోజులకోసారి గ్రామ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి లేని వారికి జాబ్ కార్డులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలింకో బ్యాటరీ వీల్ చైర్స్ లలో మరమ్మత్తులు వుంటే ఒక రోజు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి మరమ్మత్తులు చేయించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలలో దివ్వాంగుల కోసం ర్యాంపులు లేని చోట ర్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్ధిక సహాయం అమలు అయ్యేలా చూస్తామని, దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల గుర్తింపు ప్రక్రియ జరుగుతున్నదని తెలిపారు. జిల్లాకు చెందిన దివ్యాంగులు తమ ఉత్పత్తి వస్తువులు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేటు కార్యాలయంలో విక్రయించుకోవచ్చునని తెలిపారు. జిల్లాకు చెందిన దివ్యాంగులు తమ సమస్యలను తెలుపడానికి టోల్ ఫ్రీ నెంబరు 18005728980 ద్వారా సంప్రదించవచ్చునని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి కె.వి. ఉపేందర్రెడ్డి, ఎసిపి వెంకటరెడ్డి, జిల్లా పరిషత్ సిఇఓ సి.హెచ్. కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం. ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ అధికారి కృష్ణవేణి, కమిటీ మెంబర్ నర్సిహ్మ, జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజరు రామకృష్ణ, జిల్లా ఎస్.సి. అభివృద్ధి అధికారి జయపాల్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ వినోద్, మెప్మా పి.డి. రమేశ్ బాబు, జిల్లా విద్యా శాఖ కోఆర్డినేటరు జోసెఫ్, జిల్లా క్షేత్ర పరిశీలన అధికారి ఎన్న్.తిరుపతిరెడ్డి, దివ్యాంగ కమిటీ మెంబర్లు పి.మధుసూదన్ రెడ్డి, ఎ. దేవి, శివకుమార్, నర్సింహులు, చక్రధర్ రెడ్డి, ప్రకాశ్, బాలాజీ, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.