దివ్యాంగునిపై దాడి చేసిన సర్పంచుని తక్షణమే అరెస్టు చేయాలి

జహీరాబాద్ అక్టోబర్ 7( జనం సాక్షి) దివ్యాంగునిపై దాడి చేసిన సర్పంచుని తక్షణమే అరెస్టు చేయాలి అని తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మేకల సమ్మయ్య. రాష్ట్ర అధ్యక్షులు సుతారి రమేష్. మహిళా అధ్యక్షురాలు బోట్ల సుమతి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలిత తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయికోటి నర్సింలు సహయ కార్యదర్శిలు మల్లేశం లు పేర్కొన్నారు. శుక్రవారం వారు మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పరిధిలోని పుల్పోనిపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు ఉపాధి కూలి డబ్బులు అడిగినందుకు కాలితో తన్ని ఇబ్బందులు గురిచేసిన సర్పంచ్ ను తక్షణమే అరెస్టు చేయాలి ఆయన పదవి నుంచి తొలగించాలి అన్నారు. దివ్యాంగుడు కృష్ణయ్యకు రెండు కాళ్లు లేవు ఆయన పూర్తిగా వికాలాంగుడు బ్రతుకు భారమై ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనులలో తాను పనిచేసే జీవనం సాగించేవాడు ఈ క్రమంలో తాను పనిచేసిన ఈజీఎస్ పనులకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలని అడిగితే ఆ గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు బండ బూతులు తిట్టి కాలితో తన్నడం జరిగింది అధికార మతంతో కండకావరం ఎక్కి ఒక దివ్యాంగుడు అనే సానుభూతి కూడా లేక తిట్టి కొట్టడం క్షమించరాని నేరం ఇతగాడికి 2016 వికలాంగుల హక్కుల చట్ట ప్రకారం ఐపీసీ సెక్షన్ 92 /A ప్రకారం తక్షణమే అరెస్టు చేయాలి కృష్ణయ్య పై జరిగిన దాడిని యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయి వీటిని పోలీసులు సుమోటగా స్వీకరించి 92 బై ఏ కింద తక్షణమే అరెస్టు చేసి తగిన శిక్ష పడే విధంగా పోలీసులు సహకరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దేశంలో వికలాంగుల పైట్ల తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయి చట్టం ఉన్న అమలు కావడం లేదు చట్టం అమలు కొరకు ఏ ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేయడం లేదు పేరుకు మాత్రమే చుట్టాలు దివ్యాంగుల పైన తరచు భౌతిక దాడులు జరుగుతున్న ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2016లో ప్రవేశపెట్టినటువంటి వికలాంగుల హక్కుల చట్టం పూర్తిస్థాయిలో అమలు అయ్యేటట్లు చూడాలని ఈ సందర్భంగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలంటే ఒక రాజకీయ అధికారమే మూలం అందుకుగాను దివ్యంగులకు ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్ తప్పకుండా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది వీటి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ముందుకు రావాలి అని ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.