దీనులకు ధైర్యమిస్తున్న జడ్పిటిసి ఆర్థిక సహాయాలు

మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామానికీ చెందిన కిచ్చనోళ్ల దుర్గయ్య గత కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన అనుచర గణం ద్వారా ఈ విషయం తెలుసుకున్న జెడ్పిటిసి పబ్బా మహేశ్ గుప్తా బుధవారం  బాధిత కుటుంబానికి పరామర్శించి, తన సొంత డబ్బులు  5 వేల రూపాయల నగదు తో పాటు  నెలకు సరిపడా  నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. జడ్పిటిసి మాట్లాడుతూ  వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో  స్థానిక సర్పంచ్  శ్రీనివాస్ గౌడ్, వార్డు మెంబర్ పోచగౌడ్, కొండల్,సింహం, నాయకులు దొడ్ల అశోక్, గౌరీ శంకర్, ఖదీర్, రవి నాయక్, భిక్షపతి, ప్రవీణ్, ప్రసాద్, పోచం, ప్రవీణ్, నర్సింలు, నవీన్  గ్రామస్తులు బాధిత  కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన ముయ్యడి శ్రీనివాస్ ప్రమాదవశాత్తూ విద్యుత్  షాక్ కు గురైన విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ పబ్బా మహేశ్ బుధవారం తూప్రాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాదితుడీని పరామర్శించి, ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి నేనున్నానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ ముయ్యడి శ్రీనివాస్ కరెంట్ షాక్ గురికావడం బాధాకరమని, అతని కుటుంబానికి అన్ని విధాల సంపూర్ణ సహకారాలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శివ్వంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్,వార్డు సభ్యులు వంజరి కొండల్, లక్ష్మీనారాయణ, కారోబార్ గౌరిశంకర్, ముడ్డగల్ల రాజు,ఖదీర్, దొడ్లే అశోక్,వెంకటేశ్, నాగరాజు, ఎస్టీ సెల్ మండల అద్యక్షులు రవి నాయక్,తదితరులు పాల్గొన్నారు.