దుర్గ భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గా పూజ
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 02(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని కరీమాబాద్ వాటర్ ట్యాంక్ సమీపంలో ఆదివారం దుర్గ భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదానం నిర్వహించారు అంతకుముందు శ్రీ దుర్గా మాత విగ్రహం వద్ద భక్తులు పూజలు నిర్వహించారు కమిటీ బాధ్యతలు సభ్యులు స్థానిక గృహవాసులు పాల్గొన్నారు