దులిప్‌ట్రోఫీలో యువరాజ్, శిఖర్‌దావన్ సెంచరీలు
హైదరాబాద్: యువరాజ్ సింగ్ సత్తా చాటాడు. తనలో బ్యాటింగ్ పటిమ ఏమాత్రం తగ్గలేదని హైదరాబాద్‌లో జరుగుతున్న దులివ్‌ట్రోఫీ మ్యాచ్‌లో చూపించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. తన ఫిట్‌నెస్‌పై అనుమానాలున్నా వారందరికీ చక్కని ఇన్నింగ్స్‌తో జవాబు చెప్పాడు. ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాందీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నార్త్-సెంట్రల్ జోన్ల మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 346-4 పరుగులు చేసింది.