దేవరగట్టు కర్రల సమరంపై ఆంక్షలు
నిఫషేధం విధించిన జిల్లా కలెక్టర్ట్
కర్నూలు,అక్టోబర్26(జనంసాక్షి): కర్నూలు జిల్లాలో దసరా నేపథ్యంలో యేటా జరిగే దేవరగట్టు కర్రల సమరంపై కరోన ప్రభావం పడింది. మహమ్మారి వ్యాప్తి విస్తృతి నేపథ్యంలో కర్రల సమరంపై జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. కర్నూలు జిల్లా దేవరగట్టులో మాల మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద దసరా సందర్భంగా కర్రల సమరం జరుగుతుంది. మల్లేశ్వరుల ఉత్సవ విగ్రహాల కోసం పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఈ ఉత్సవాలను చూడటానికి లక్షలాది మంది హాజరవుతారు.
అయితే కరోనాతో ఈ ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాడియన్ ఆదేశాలు జారీచేశారు. రాత్రి జరిగే ఈ ఉత్సవాన్ని చూడటానికి ఎవరూ రాకూడదని ఆంక్షలు విధించారు. దీంతో దేవరగట్టుకు రాకపోకలపై పోలీసులు నిషేధం విధించారు. గామ్రానికి వెళ్లే రహదారులను మూసివేశారు. ఉత్సవ నిషేధంపై ఇప్పటికే అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.