దేవాదాయశాఖతో చర్చలు సఫలం సమ్మె విరమించిన తెలంగాణ అర్చక సమాఖ్య

హైదరాబాద్‌: తెలంగాణ అర్చక, ఉద్యోగ సమాఖ్య సమ్మెను విరమించింది. వేతనాల విషయంపై వారు సమ్మె చేపట్టారు. ఈ రోజు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి చిత్రారామచంద్రన్‌తో వారు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ట్రెజరా ద్వారా జీతాల చెల్లింపునకు కమీటీ నివేదిక త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుటామని ఆమె వారికి హామి ఇవ్వటంతో వారు సమ్మె విరమించారు. రేపటినుండి విధులకు హాజరుకానున్నారు.