దేవారంజాల్ దేవాలయ భూముల అన్యాక్రాంతంపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక హర్షనీయం*
సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ
మునగాల, నవంబర్ 15(జనంసాక్షి): హైదరాబాద్ శివారు ప్రాంతమైన దేవరాంజలో ఉన్న దేవాలయ భూములు కబ్జాకు గురై వివిధ నిర్మాణాలు చేపట్టిన భూములపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ సమగ్ర విచారణ జరిపి కబ్జాకు గురైన 1350 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అందులో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేసి వెంటనే ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకోవాలని, విచారణ కమిటీ సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందించడం హర్షనీయమని మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న వివిధ దేవాలయ భూములపై ఇలాగే విచారణ కమిటీలను ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టి దేవాలయ భూములు ఆయా దేవాలయాలకే చెందేలా చర్యలు చేపట్టాలని, తద్వారా ఆయా ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని, ప్రాచీన దేవాలయాలకు తగిన ప్రాచుర్యం కల్పించాలని సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు