దేవాలయ అధికారులు దాసారపు గుట్టను కాపాడాలి

సర్వే నంబర్ 305/A లో భూసేకరణ చేయాలి

మల్లన్న ఆలయ అస్తిత్వం కోల్పోయే ప్రమాదం

భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి

సిపిఎం మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి

కొమురవెల్లి జనం సాక్షి

దాసారపు గుట్టను రియల్ వ్యాపారస్తుల చర నుండి దేవాలయ అధికారులు కాపాడాలని శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం బృందంతో కలిసి దాసారపు గుట్టను చదును చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్న ఆలయం వద్ద దసారపు గుట్ట ఎంతో ప్రసిద్ధి చెందిందని ఆ గుట్టపై సంగన్న, బ్రహ్మంగారి, ఆలయాలు ఉన్నాయని తెలిపారు. దాసారపు గుట్ట నవాబుల కాలంలో ఆక్రమించబడిందని దానిని పట్టా చేసుకున్న ఓ వ్యక్తి  రియల్ ఎస్టేట్ వ్యాపారులకు  305/a లో దాదాపు 22 ఎకరాల భూమిని విక్రయించాడని, అగ్రిమెంట్ చేసుకున్న  వ్యాపారులు గుట్టను చదును చేస్తున్నారని తెలిపారు.మల్లన్న ఆలయం వద్ద ఉన్న  గుట్ట అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని మల్లన్న భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. సర్వేనెంబర్ 223 లో సుమారు16 ఎకరాల గుట్ట మల్లన్న ఆలయ ఆధీనంలో ఉందని దానిపైన నిర్మించే గెస్ట్ హౌస్ కు నాలుగు కోట్ల రూపాయలతో దేవాదాయ శాఖ రోడ్డు నిర్మాణం చేపట్టిందని, దీన్ని ఆసరా గా తీసుకొని పట్టాభూమి పేరుతో   సింహ భాగం దాసారపు గుట్ట ప్రైవేటు వ్యక్తుల చెరలోకి మారబోతోందని తెలిపారు. ప్రస్తుతనికి పట్టాదారుడు వ్యాపారులకు అగ్రిమెంట్ చేశాడని వెంటనే  ఆలయ అధికారులు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చొరవ చూపి ప్రభుత్వ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భూ సేకరణ చేసి మల్లన్న ఆలయానికి దాసారపు గుట్ట భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అయినాపూర్, రాంసాగర్ సర్పంచులు, చెరుకు రమణారెడ్డి, తాడూరి రవీందర్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బద్దిపడగ కిష్టారెడ్డి, సనాది భాస్కర్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బక్కేల్లి బాలకిషన్, మండల కమిటీ సభ్యులు తాడూరి మల్లేశం, శ్రీనివాస్, ఎల్లయ్య, చెరుకు వెంకట్ రెడ్డి, నీల బిక్షపతి, ఆరుట్ల రవీందర్, నూకల శ్రీనివాస్, వుల్లంపల్లి సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

Attachments area