దేవాల్‌గుడి ఘటన దురదృష్టకరం

harish-on-correption

మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం దేవాల్ గుడి ప్రాంతం వద్ద విద్యుత్ హైటెన్షన్ వైరు లారీకి తగిలి ఏడు మంది మృతి చెందిన సంఘటన దురదృష్టకరమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మెరుగైన వైద్యసేవలందించేందుకు క్షతగాత్రులను హైదరాబాద్ లోని నిమ్స్, యశోదా దవాఖానాలకు ప్రత్యేక అంబులెన్సుల ద్వారా తరలించినట్లు తెలిపారు. క్షతగాత్రులందరికీ ప్రభుత్వ ఖర్చులతోనే వైద్యం చేయిస్తామని వివరించారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖా మంత్రి లక్ష్మారెడ్డితో ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రమాదం చోటుచేసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.