దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలు 2030 సంవత్సరం నాటికీ అన్ని రంగాలలో సుస్థిరమైన అభివృద్ధి

జనం సాక్షి ప్రతినిధి మెదక్, సెప్టెంబర్ 9, 2022జనం సాక్షి ప్రతినిధి మెదక్, సెప్టెంబర్ 9, 2022           దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలు 2030 సంవత్సరం  నాటికీ  అన్ని రంగాలలో సుస్థిరమైన అభివృద్ధి సాధించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ద్యేయమని స్థానిక సంస్థల  ప్రతిమ సింగ్ అన్నారు. అందులో  భాగంగా ఆరోగ్యకరమైన పోటీ నెలకొల్పి ప్రజల  జీవన ప్రమాణాలు మెరుగు పరచుటకు స్థిరమైన అభివృద్దే లక్ష్యంగా  కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ జాతీయ పంచాయతీ అవార్డులును  ఇస్తున్నదని అన్నారు. పంచాయత్ రాజ్ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 24 న ఈ అవార్డులను ప్రధానం చేయనున్నదని అందుకోసం ఈ నెల 10 నుండి ఆన్ లైన్ ద్వారా ప్రశ్నపత్రాల రూపంలో ఎంట్రీలను ఆహ్వానిస్తున్నదని అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో మండల పరిషద్ అభివృద్ధి అధికారులు, ఏం.పి .ఓలు,  ఏ.పి .ఏం లు, ఏ.పి .ఓ.లు, సి.డి.పి .ఓ.లు, హెల్త్ సూపర్వైజర్ లకు ఏర్పాటు చేసిన ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ   పచ్చదనం, పరిశుభ్రతతో పాటు అభివ్రుది సంక్షేమ రంగాలలో జిల్లాను ముందుంచి ప్రతి గ్రామ పంచాయతీ  జాతీయ పంచాయితీ అవార్డు సాధించేలా అధికారులు కృషి చేయాలని అన్నారు.        17 అంశాలలో స్థిరమైన అభివృద్ధి ప్రామాణికంగా  2022-23 సంవత్సరానికి ఇట్టి అవార్డుల ఎంపికకు  గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో 9 కేటగిరీలలో పోటీలు నిర్వహిస్తున్నదని అన్నారు.   దీన్  దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్  వికాస్ పురస్కార్ క్రింద 9 అంశాలలో, ఒక్కో  అంశంలో మూడు అవార్డుల చొప్పున  గ్రామ, మండల,జిల్లా స్థాయిలో  ఇవ్వనుందని అన్నారు. అలాగే నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ పంచాయత్ సతత్  వికాస్ పురస్కార్ క్రింద మండల, జిల్లా స్థాయి పంచాయితీలకు అవార్డులు ఇవ్వనున్నదని  ఆమె తెలిపారు. అవార్డు పొందడమే లక్ష్యంగా   జిల్లాలోని 469 గ్రామ పంచాయతీలు, 20 మండలాలు ఈ పోటీలలో పాల్గొనాలని  అధికారులను ఆదేశించారు. కేటగిరీ వారీగా వివరాలు ఇలా .. పంచాయతీ అవార్డులు మెరుగైన జీవనోపాధి, ఆరోగ్యకరమైన, బాలల స్నేహపూర్వక, నీటి సమృద్ధి, పచ్చదనం- పరిశుభ్రత, స్వయం సమృద్ధి -మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, మంచి పరిపాలన, మహిళా స్నేహపూర్వక పంచాయతీలు…  ఒక్కో క్యాటగిరిలో ఉత్తమంగా  (3) అవార్డులను ఎంపిక చేసి గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో ఇవ్వడం  జరుగుతుందని అన్నారు.  జిల్లా స్థాయిలో ఎంపికైన వాటిని రాష్ట్రస్థాయిలో పోటీలలో పాల్గొనే అవకాశం ఉంటుందని,  జాతీయస్థాయిలో అవార్డుల పంపిణీ నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.  కాబట్టి సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ 9 ఆంశాలతో  ప్రతిపాదనలు తయారు చేయాలని,  ఒక్కొక అంశానికి సంబంధించి సంబంధిత దృవీకరణలతో  ఖచ్చితమైన  సమాచారమందించాలని  అన్నారు. అలాగే పంచాయితి రాజ్ శాఖకు సంబంధించి  17 అనుబంధ శాఖల సమాచారం వెంటనే సంబంధిత మండల, గ్రామపంచాయితీలకు అందజేయాలన్నారు.   అట్టి సమాచారంతో  పోటీలలో పాల్గొని  ఈ నెల 10 నుండి  30 వరకు ఆన్ లైన్ లో  సంబంధిత పోర్టల్  నందు  ప్రశ్నాపత్రాల రూపంలో  ఇచ్చిన వాటికి  వివరాలు నమోదు చేసి   జిల్లాకు ఎక్కువ సంఖ్యలో  అవార్డులు తెచ్చేలా కృషి చేయాలని కోరారు.ఈ సమావేశంలో డి. ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.పి .ఓ. శ్రీనివాస్, డి.ఏం.అండ్ హెచ్.ఓ. వెంకటేశ్వర్లు,  జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ,  జిలాలోని ఏం.పి .డి.ఓ.లు, ఏం.పి.ఓ.లు,  ఏ.పి .ఏం లు, హెల్త్ సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.–