దేశంలోనే గొప్ప పథకంగా దళిత బంధు.
దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు.
ఆ వర్గాలు ఉన్నతంగా ఎదగడమే సీఎం కెసిఆర్ లక్ష్యం
సీఎం కెసిఆర్ కి దళిత వర్గాలు రుణపడి ఉంటారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.
జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 11 అక్టోబర్ 2022 దళితుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం సీఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశంలోనే గొప్ప పథకమని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.
ఈ సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల, లింగాల, అచ్చంపేట, అమ్రాబాద్ మండలాలకు చెందిన నలుగురికీ దళిత బంధు పథకం ద్వారా మంజూరైన నూతన కార్లను హైదరబాద్ లోని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్వగృహంలో ఆయన చేతులమీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల మాట్లాడుతూ దళితుల తలరాతలను మార్చడం కోసం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే, దళితుల జీవితాల్లో వెలుగులు నింపడం ఆర్ధికంగా పరిపుష్టం కావడం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఎంతో మంది సీఎం లు మారారు కానీ దళితుల తలరాతలు మారలేదని కేవలం సీఎం కెసిఆర్ తోనే దళిత బంధు పథకం ద్వారా ముందుకు పోతున్నాయని వారు అన్నారు.
గత ప్రభుత్వాలు కేవలం దళితులను ఓట్ల కోసమే వాడుకున్నారు తప్పితే ఒరిగి పెట్టింది ఏమీ లేదని సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమమే వారి ధ్యేయం అని ఆయన అన్నారు.
ఈసందర్భంగా మంజూరైన నూతన కార్లను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి లబ్ధిదారులను ఆశీర్వదించి శుభం కలగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు ప్రతాప్ రెడ్డి, రాంబాబు నాయక్, విజేoదర్ గౌడ్ ముఖ్య నాయకులు శంకర్ మాదిగ శ్రీరాములు, గుద్దటి బాలరాజు, శ్రీరాములు, ఉప్పరి బాలరాజు, సురేష్, అనిల్ కుమార్, సతీష్, శ్రీను, తిరుపతి, పరమేష్, తదితరులు ఉన్నారు.