దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలతో తెలంగాణ అభివృద్ధి
జుక్కల్,సెప్టెంబర్19,(జనం సాక్షి),
దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకు పోతుందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు.ఆయన సోమవారం కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో కళ్యాణ లక్ష్మి, శాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు. ఏ బందువైనా ఆడపిల్ల వివాహానికి మహా అయితే యాభై వేలుఇస్తారని, కేసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల వివాహానికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారాక్ పథకాల ద్వారా లక్షా పదహారు రూపాయలు అందజేస్తోంది తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి వృద్దాప్యం వరకు కేసిఆర్ మహిళకు సంక్షేమ పథకాలతో ఆసరాగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. గర్భిణీలకు ఆంగన్వాడిలద్వార సంపూర్ణ ఆహారం, వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగి
ఆడపిల్ల పుడితే 13వేలు, మగ పిల్లాడు పుడితే12వేల రూపాయలు ప్రభుత్వం అందజేస్తోందనిఎమ్మెల్యే తెలిపారు. ఆడపిల్లలు చదువటానికి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆడపిల్ల వివాహానికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు, విధవ లకు, ఒంటరి మహిళలకు,బీడికార్మికులకు, వృద్దులకు నెలకు రెండువేల రూపాయలు పించన్ అందిస్తున్నామని తెలిపారు.సబ్బండవర్గాల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపిపి కవితావిజయ్, జడ్పీటిసి శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్ రెడ్డి, సాయిరెడ్డి, నర్సాగౌడ్,శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్, ఎంపిటిసిలు పాల్గొన్నారు