దేశంలో పార్లమెంటరీ ఫాసిజమును అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వం

వరంగల్ ఈస్ట్, జూలై 24 (జనం సాక్షి)దేశంలో పార్లమెంటరీ ఫాసిజం అమలవుతోందని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే గోవర్ధన్ అన్నారు గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో కుకీ నాగా జాతుల ప్రజలపై మోడీ, బీరెన్ సింగ్ ప్రభుత్వాలు కుట్రపూరితంగానే దాడులు హత్యలు అత్యాచారాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈరోజు నగరంలోని ఖి లా వరంగల్ పెట్రోల్ బంక్ ఏరియాలో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఆ రెల్లి కృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రజాసంఘాల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.మణిపూర్ రాష్ట్రంలో హింసకాండ చేసేందుకు ప్లాన్ ప్రకారం ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాగా కుకి ప్రజల ఊచకోత కు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు.ఇప్పటికే మణిపూర్ రాష్ట్రంలో కేంద్ర సాయుధ బలగాల చట్టం అమలవుతున్నదని, భూములు అంబానీ ఆదానీలకు అప్పగించారని ఆదివాసీల రక్షణ కోసం భారత రాజ్యాంగం లోని 5 6 షెడ్యూలలో ఉన్న హక్కులు కాలరాచి వేయబడ్డాయని ఆదివాసీ ప్రజలు నివసిస్తున్న అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించి వారిని సేద్యం చేసుకోనివ్వడం లేదని ఆయన అన్నారు . ఇది చాలదన్నట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైదాన ప్రాంత మేయితి తెగకు చెందిన వారిని షెడ్యూల్డ్ జాబితాలో చేర్చి వారితో మూలవాసులైన ఆదివాసి జాతులపై హత్యలు అత్యాచారాలు గృహ దహనాలు చేయిస్తున్నాయని అన్నారు.
మోడీ ప్రభుత్వం దేశంలో జమిలీ విధానమును అనుసరిస్తున్నదని ప్రభుత్వంగ సంస్థలను దేశ సహజ సంపదను భూములను బడా కార్పొరేట్ లు అయిన అంబానీ ఆదానీ లకు సామ్రాజ్యవాదులకు అప్పగిస్తూ మరొక పక్క జాతుల నిలయంగా ఉన్న దేశంలో హిందూ బ్రాహ్మణియా ఫాసిస్ట్ విధానాలను అమలు చేస్తూ మైనారిటీ మతస్తుల జాతుల తెగల దళితుల ఆదివాసుల పై దాడులు చేస్తున్నదని ఆయన అన్నారు .
ఆర్ఎస్ఎస్ కనుసన్నలలో మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ మారణకాండ పార్లమెంటును ఉపయోగించుకొని అమలు చేస్తున్న హిందూ బ్రాహ్మణీయ ఫాసిజంగా ఆయన అభివర్ణించారు, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్ట్ విధానాలపై జరిగే ఉద్యమాలలో క్రియాశీలకంగా పాల్గొనాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాచర్ల బాలరాజు పి వై ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్ పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ విజయ కన్నా లు మాట్లాడారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.