దేశంలో మతమౌఢ్యానికి మోదీ ప్రతీక

2

– ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ
ఢిల్లీ, నవంబర్‌14(జనంసాక్షి):కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మోదీపై మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో మత జాడ్యానికి ముసుగు వేస్తున్నారని ఆమె విర్శించారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ 125వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో సోనియా ప్రసంగించారు. దేశ అభివృద్ధి, మానవ విలువలు, కళల ప్రగతికి నెహ్రు పరితపించారని కొనియాడారు. గతానికి భిన్నంగా ప్రస్తుతం ప్రజల మధ్య విద్వేషాలు రగిలించి దాడులకు పాల్పడేలా చేస్తున్నారని, దేశంలో అసహనానికి ఇది దారి తీస్తోందని బీజేపీ ప్రభుత్వంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌పై సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంపైనా విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ గాంధీ నిప్పులు చెరిగారు. గత 18 నెలలుగా అభివృద్ధి గురించి గొప్పలు చెప్పడమే తప్ప దేశంలో ఆయన చేసిన అభివృద్ధేవిూ లేదని విమర్శించారు. నెహ్రూ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సోనియా, రాహుల్‌? మోడీ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం దేశంలో నెహ్రూ జ్ఞాపకాలను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. లౌకికవాదాన్ని వ్యతిరేకించేవారు కేవలం నెహ్రూకే కాదు గాంధీజీకి కూడా వ్యతిరేకమని సోనియా, రాహుల్‌ అన్నారు. స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా ఇళ్లలో దాక్కున్న వాళ్లంతా ఇప్పుడు నెహ్రూ ప్రతిష్టను కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని సోనియా మండిపడ్డారు.