దేశంలో మిషన్ భగీరథ గొప్ప పథకంగా నిలిచింది -మంత్రి ఎర్రబెల్లి

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన  అవార్డుల్లో మిషన్ భగీరథ అనేక అవార్డులు పొందాం..
 – మిషన్ భగీరథ శాఖకు చెందిన పలువురు ఇంజనీరింగ్, ఇతర అధికారులను ఘనంగా సన్మానం..
– అభినందించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..స్మిత సభర్వాల్..
హనుమకొండ బ్యూరో 14 అక్టోబర్ జనంసాక్షి
చింటగట్టు లోని మిషన్ భగీరథ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు
అంతకు ముందు మంత్రి ఎర్రబెల్లి మిషన్ భగీరథ కార్యాలయం, నీటి శుద్దీకరణ, నాణ్యత ప్రమాణాలు పరీక్షలు, పంపిణీ వంటి ఇతర అన్ని విభాగాలను పరిశీలించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ
ప్రతి మనిషి నిత్యావసర నీళ్ళు
శుద్ధి చేసిన, పరిశుభ్రమైన మంచినీటిని అందించడంలో గత ప్రభుత్వాలు విఫలం అయ్యాయి
మోటార్లు, స్టార్లు, ట్రాన్స్ ఫార్మర్ లు కాలిపోయేవి
ప్రజా ప్రతినిధులు తన పదవీ కాలం నీళ్ళు ఇవ్వడానికి సరిపోయేది కాదు
సీఎం కెసిఆర్ ఏ ముహూర్తాన ఈ కార్యక్రమం చేపట్టాడో కానీ, అద్భుతమైన పథకాన్ని మొదలు పెట్టాడు అని అన్నారు
నేను అసెంబ్లీ లో ప్రతిపక్షం లో ఉండగా అనేక సార్లు ప్రశ్నించాను
 కానీ కెసిఆర్  కాస్త ఓపిక పట్టమని చెప్పేవారు
మిషన్ భగీరథ కార్యక్రమం అమలు చూసి, నేను టీఆరెఎస్ లో చేరాను
సీఎం కెసిఆర్, కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, స్మితా సబర్వాల్ తదితరులు బాగా కష్ట పడ్డారుఅని అన్నారు
వాళ్లకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు
 ఈ శాఖ కు మంత్రిగా వచ్చే సరికి, మిషన్ భగీరథ స్థిరీకరణ జరిగింది. ఇప్పుడు అద్భుత ఫలితాలు వచ్చాయి. వాటిని మనం ఇవ్వాళ అనుభవిస్తున్నాం అన్నారు
ఆ కారణంగానే అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయి
దేశంలోనే మిషన్ భగీరథ గొప్ప పథకంగా నిలిచింది. దేశానికి ఆదర్శoగా నిలిచింది
మన మంచినీరు పరిశుభ్రమైన, నాణ్యత, పరిమాణం, వాటి కొనసాగింపు వంటి పలు అంశాల్లో మిషన్ భగీరథ గొప్ప పథకంగా దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు
మన  మిషన్ భగీరథ పథకాన్ని కాపీ చేసి, జల్ జీవన్ మిషన్ వంటి పలు పేర్లతో దేశంలో, వివిధ రాష్ట్రాల్లో అమలు అవుతున్నది
కానీ, మన రాష్ట్రంలో మాత్రమే, వర్షపు, భూ ఉపరితల నీటిని అందిస్తున్నాం
కానీ, దేశంలో మిగతా రాష్ట్రాల్లో బోర్ల నీటిని అందిస్తున్నారు
మనం ఇస్తున్న మంచినీరు స్వచ్ఛమైనవి. ఆరోగ్య కరమైనవి
కేంద్రం పార్లమెంటులో, లిఖిత పూర్వకంగా మన రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా చెప్పింది అని అన్నారు
100 శాతం ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలకు నీరు అందిస్తున్నాం
రాష్ట్రాన్ని ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నం
ప్రతి మనిషికి అత్యధికంగా నీటిని అందిస్తున్నాం
100 శాతం అంగన్వాడీ, దేవాలయాలు, చర్చీ లు, మసీదులు తదితర ప్రభుత్వ రంగ సంస్థలు, పవిత్ర స్థలాలకు
ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలి. అహర్నిశలు కష్ట పడాలి
ఇప్పటి వరకు 53 అవార్డులు వచ్చాయి
ఒకప్పుడు గంగాదేవి పల్లె మాత్రమే ఆదర్శంగా ఉండేది
ఇవ్వాళ దేశంలో 20 గ్రామాలను ఎంపిక చేస్తే, అందులో 19 గ్రామాలు తెలంగాణవే
నీతి అయోగ్ సిఫారసు చేసినప్పటికీ కేంద్రం 19 వేల కోట్లు ఇవ్వలేదు
నయా పైసా ఇవ్వక పోయినప్పటికీ, కేవలం రాష్ట్ర నిధులతోనే మిషన్ భగీరథ ను పూర్తి చేశాం అన్నారు
అవార్డులు పొందిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు
స్మితా సబర్వాల్ మాట్లాడుతూ..
అవార్డులు రావడంలో అందరి కృషి ఉందన్నారు
అత్యంత ప్రతిభావంతంగా పని చేస్తున్న మిషన్ భగీరథ సిబ్బందికి, అధికారులకు అభినందనలు తెలిపారు
ఇంత గొప్ప శాఖకు నేను ఇంచార్జీ గా ఉన్నందుకు గర్వ పడుతున్నాను
అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  వివిధ విభాగాల్లో అవార్డులు పొందిన పలువురు ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, తదితరులకు ప్రత్యేక ప్రశంసా పత్రాలు, మేమొంటోలు అందచేశారు.ఈ కార్యక్రమం లో
వరంగల్ మహానగర మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు, సీఎంఓ అధికారులు ప్రియాంక వర్గీస్, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ ప్రావీణ్య, enc కృపాకర్ రెడ్డి,మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.