-దేశంలో 46 కోట్ల కస్టమర్లకు ఎస్ బి ఐ బ్యాంకింగ్ సేవలు

 

 

 

 

 

 

 

 

-దేశంలో 46 కోట్ల కస్టమర్లకు ఎస్ బి ఐ బ్యాంకింగ్ సేవలు.-తెలంగాణ రీజయన్ లో ఉత్తమ సేవల ఆధునికరణలో నాగర్ కర్నూల్ ఎస్ బిఐ.-ప్రతి వినియోగదారునికి ఉత్తమ సేవలు త్వరిత గతిన అందజేస్తాం.-భారతీయ స్టేట్ బ్యాంక్ జనరల్ మేనేజింగ్ డైరెక్టర్ చేల్ల శ్రీనివాసులు శెట్టి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్13 (జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్డుపై గల భారతీయ స్టేట్ బ్యాంక్     సెంట్రల్ ఎయిర్ కండిషన్ ఆధునికరణతో మంగళవారం నాడు భారతీయ స్టేట్ బ్యాంకులో మేనేజింగ్ డైరెక్టర్ చేల్లా శ్రీనివాసులు శెట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో అత్యధిక ఆధునికరణ సేవలతో నాగర్ కర్నూల్ భారతీయ స్టేట్ బ్యాంక్ ను అన్ని వసతులు ఏర్పాటు చేశామని అన్నారు.భారతదేశంలో భారతీయ స్టేట్ బ్యాంకులలో 46 కోట్ల మంది వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలు అందజేస్తున్నమనీ తెలిపారు.పట్టణ, గ్రామీణ,గిరిజన ప్రాంతాల ప్రజలకు ఆధునిక బ్యాంకింగ్ సేవలకు, వినియోగదారుల ఇబ్బందులు నివారణకు ప్రత్యేకంగా ఈ బ్రాంచ్ లో వసతులు కల్పించామని తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం బ్యాంకులోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లాకర్లను వివిధ సేవలను ఆయన పరిశీలించారు.బ్యాంక్ ఆవరణలో మొక్కలను నాటి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి వారు పాల్గొని ప్రకృతిని కాపాడాలని కోరారు. ఈ ప్రాంతంలోని ప్రజలు భారతీయ స్టేట్ బ్యాంక్ బ్యాంకింగ్ సేవలను అధిక మొత్తంలో వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. రుణ గ్రహితలకు మంజూరు చేసిన ధృవ పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్కిల్ చీఫ్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ , హైదరాబాద్ సర్కిల్ చీఫ్ మేనేజర్ దేశాయి మిత్ర, నలగొండ రీజినల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్, జోగులాంబ రీజినల్ మేనేజర్ ఐ. మధుబాబు, నాగర్ కర్నూల్ బ్రాంచ్ మేనేజర్ కె. గురు ప్రసాద్, ఏ. డి.బి. మేనేజర్ రమేష్ కుమార్, జోగులాంబ రీజినల్ కార్యదర్శి ఓ.ప్రవీణ్ కుమార్, క్యాష్ ఆఫీసర్ నాను నాయక్, వివిధ బ్యాంకుల సిబ్బంది కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.